ఓటు హక్కును వినియోగించుకోవాలి

Fri,March 22, 2019 01:07 AM

మానవపాడు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి మండల అభివృద్ధి అధికారి ఆంజనేయరెడ్డి సూచించారు. మ ండలంలోని గురువారం ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వీవీ ప్యాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం పీడీవో మాట్లాడుతూ18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్క రూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ విధానంలో బ్యాలెట్ పత్రానికి ప్రత్యామ్నయంగా వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ య ంత్రాలు వాటితో పాటు పనిచేసే వీవీప్యాట్ల పనితీరును ఓటర్లకు చూ యించారు. కార్యక్రమంలో వడ్డేపల్లి ఎంపీడీవో రాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రాజోళిలో..
రాజోళి: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీవీ ప్యాట్లు, ఈవీఎంలతో ఓటింగ్ విధానంపై ఎంపీడీవో రాములు ప్రజలకు అవగాహన కల్పించారు. గురువారం మండల కేంద్రమైన రాజోళిలో వీవీ ఫ్యాట్లు, ఈవీఎంలతో ప్రజలకు ఓటు వేసే విధానాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కేపీఐ రివార్డు అందుకున్న రాజోళి ఎస్‌ఐ
రాజోళి: రాజోళి ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి కేపీఐ(కీ పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్) రివార్డును అందుకున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ లక్ష్మీ నాయక్ ఈ రివార్డును అందించారు. ప్రజా సంబంధాలు, సమస్యల పరిష్కారం, లోక్ అదాలత్ కేసులు, చా ర్జీ షీట్ దాఖలు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన సేవలను గుర్తించి ఈ రివార్డును అందించారు. ఈ రివార్డు రావడంపై ఎస్‌ఐతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles