ఆస్తి పన్ను వసూళ్లు ముమ్మరం

Fri,March 22, 2019 01:07 AM

అయిజ: పురపాలక యంత్రాం గం ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేసింది. 2018-19 ఆర్థిక సంవత్స రం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏరియర్స్‌తోపాటు ఈ ఏడాది చెల్లించాల్సిన పన్నుల వసూళ్లను వేగవంతం చేసింది. పట్టణంలో ప్రతిరోజు రెవెన్యూ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వ సూలు చేస్తున్నారు. ఈ ఏడాది అయి జ పురపాలికలో రూ. 1.93 కోట్లు పన్నులు వసూలు చేయాలని సీడీఎంఏ లక్ష్యంగా నిర్దేశించింది. ఇంటి పన్నులు, నల్లా, వ్యాపార, వృత్తి లైసెన్స్‌ల నుంచి ఆస్తి పన్నులు వసూలు చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు రూ. కోటి 3 లక్షలు వసూలు చేశారు. మరో 10 రోజులలో 90 ల క్షలు వసూలు చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పన్నులు నెలాఖ రు వరకు చెల్లించకపోతే పన్నులో 5 శాతం జరిమానా పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెం డిం గ్ బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 10 రోజులే గడువు ఉండటంతో లక్ష్యం చేరుకునేందుకు కమిషనర్ వెంకటయ్య, ఇన్‌చార్జి ఆర్‌ఐ ఇస్మాయిల్, ఎప్పటి కప్పుడు సమీక్షజరుపుతున్నారు.

ఆస్తి పన్నుల వసూ ళ్లను ఎట్టి పరిస్థితితుల్లో లక్ష్యం పూర్తి చేసేందుకు పురపాలిక యం త్రాంగం చర్యలు తీసుకుంటున్నది. సెలవు దినాలలో సైతం పన్నులను వ సూలు చేస్తున్నారు. ఈ నెల 31 లో గా పన్నులు చెల్లిస్తే ఎలాంటి జరిమానాలు ఉండవని, గడువు దా టితే ప న్నులో ఐదుశాతం అదనంగా చెల్లి ంచాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నెలాఖరులోగా ఏరియర్స్ చెల్లించని యజమానుల ఆస్తులను జప్తు చేసేందుకు పురపాలిక యంత్రాంగం సిద్ధమవుతున్నది.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles