వైభవంగా స్వామి వారి కల్యాణం

Fri,March 22, 2019 01:07 AM

మల్దకల్ : మండల కేంద్రంలోని శ్రీ స్వయం భూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మీ, భూదేవిల కల్యాణాన్ని అర్చకులు ప్రసన్నచారి, మధుసూధన్‌చారి, రమేష్‌చారి, రవిచారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల వేద మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి కల్యాణం ఎంతో కమనీయంగా సాగింది. స్వామి వారి కల్యాణానిన తిలకించాటానికి మండల ప్రజలే కాక ఇతర ప్రాం తాల నుంచి ఎంతో మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం కల్యాణ దాత శేషంపల్లి ధర్మారెడ్డి దంపతులకు స్వామి వారి శేష వ స్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles