కాంగ్రెస్ కకావికలం..

Thu,March 21, 2019 01:57 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే ఒక్క దెబ్బతో కాంగ్రె స్ పార్టీ విలవిలలాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే.అరుణ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఉమ్మ డి జిల్లా హస్తం శ్రేణులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాం గ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరు ణ.. ఆ పార్టీ నేతల తీరుతో విసుగు చెందడంతోపాటు కాంగ్రెస్‌లో మనుగడ లేద నే ఉద్దేశంతో పార్టీ మారారు. డీకే అరుణ పార్టీ మారడం తో ఇన్నాళ్లు ఆమె వెంట ఉన్న పార్టీ ముఖ్య నేతల తో పాటు క్యాడ ర్ కూడా నిరుత్సాహానికి గురైంది. డీకే.అ రుణ కాంగ్రెస్‌ను వీడటంతో ఆమె సొంత నియోజకవర్గమైన గద్వాల పరిధిలో ఉండే నాగర్‌కర్నూల్ ఎంపీ సెగ్మెంట్‌తోపాటు ఇటు మహబూబ్‌నగర్ పార్లమెం ట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ గల్లంతవ్వనుంది. ఇక జిల్లాలో ఏకైక ప్ర తిపక్ష ఎమ్మెల్యే అయిన హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పా ర్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థా నాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చినైట్లెం ది. తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ ప్రభావంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పో యే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఈ తరుణంలో డీకే అరుణ, హర్షవర్ధన్‌రెడ్డి పార్టీని వీడటం ఆ పార్టీపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఇక అసెంబ్లీ ఎ న్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లే కుండా చతికిల పడిన బీజేపీ.. ప్రస్తుతం డీకే. అరుణ చేరికతో పోటీ ఇస్తామనే స్థితికి చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితితో ఆ పార్టీ కోలుకునే పరిస్థితే కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొల్లాపూర్ ఎ మ్మె ల్యే హర్షవర్ధన్‌రెడ్డి చేరికతో జిల్లాలో మొత్తం 14 స్థానాలతో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తు న్న టీఆర్‌ఎస్ పక్షాలకు అందనంత ఎత్తులో ఉంది.

గతంలోనూ త్రిముఖ పోటీయే..
గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ నెలకొన్నది. ముగ్గురు ఉద్దండులు ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుం చి ఏపీ.జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎస్.జైపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చే శారు. ముగ్గురు కూడా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులు. జితేందర్‌రెడ్డి అప్పటికే ఓ సారి ఎం పీగా పనిచేసిన అనుభవం ఉండగా.. జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక శాఖలెన్నో నిర్వహించిన అనుభవశీలి. ఇక నాగం జనార్దన్‌రెడ్డి సైతం సమై క్య రాష్ట్రంలో అనేక మంత్రి పదవులు అధిరోహించారు. అయితే త్రిముఖ పోటీలో కాంగ్రెస్, బీజేపీలను వెనక్కి నెట్టి టీఆర్‌ఎస్ ఘన విజయం సా ధించింది. సేమ్ అప్పటి సీనే ఇప్పుడూ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పా ర్టీ అప్పుడు ఎంతో బలంగా ఉండేది. అంతకు ముందే అధికారంలో ఉన్న పార్టీగా క్యాడర్ ఎంతో పటిష్టంగా ఉండటం ఆ పార్టీకి అదనపు అర్హతగా ఉండింది. ఇక నాగం జనార్దన్‌రెడ్డి సైతం తిరుగులేని నేతగా పేరు తెచ్చుకుని ఉన్నారు. ఇంతటి నేతలు కూడా టీఆర్‌ఎస్ హవాలో కొట్టుకుపోయారు. రెండు పార్టీలు రెండు, మూడు స్థానాలకు పరిమితం అయ్యాయి.

అప్పుడే అలా ఉంటే.. మరి ఇప్పుడు..
2014లో తాజాగా అధికారం అనుభవించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. బీజేపీ మోడీ జపంతో పోటీలో దూసుకుపోయే ప్రయ త్నం చేసింది. రెండు పార్టీలు సైతం ఎంతో బలం గా ఉన్న భ్రమ కల్పించాయి. కానీ రెండు పార్టీలు సైతం అప్పుడు బొక్కబోర్లా పడ్డాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే అందని విజయం ఇప్పుడు అందుకోవడం అసాధ్యంగా చెప్పొచ్చు. డీకే.అరు ణ కాంగ్రెస్ పార్టీని వీడటంతో అటు ఆమె సొంత నియోజకవర్గం పరిధిలోని నాగర్‌కర్నూల్, ఇటు ఆమె ప్రభావం చూపించే అవకాశం ఉన్న మహబూబ్‌నగర్.. రెండు చోట్లా కూడా కాంగ్రెస్ ఆశలు గల్లంతైనట్లు చెప్పొచ్చు. ఇప్పటికే ఆమెతోపాటు ఆ పార్టీకి చెందిన సింహ భాగం క్యాడర్ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలు అటు నాగర్‌కర్నూలు అభ్యర్థి మల్లు రవి, ఇటు మహబూబ్‌నగర్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి శరాఘాతంలా తాకే అవకాశం కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లు ఉమ్మడి జిల్లాలో చెప్పుకునేందుకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం ఆ పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చుతోంది. అసలే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం దిక్కుతోచని స్థితికి చేరుకున్నది. ఈ దశలో ప్రస్తుత పరిణామాలు పాలమూరులో కాంగ్రెస్ కోటకు బీటలు వారినట్లే అని చెప్పొచ్చు. ఈ తరుణంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో ఆ పార్టీ అభ్యర్థులకు అత్యంత సంకట స్థితి నెలకొన్నదని అంచనా వేస్తున్నారు.

బలం పుంజుకున్నా.. గెలిచే పరిస్థితి లేదు..
గత ఎన్నికల్లో మోడీ ప్రభావంతో నాగం జనార్దన్‌రెడ్డి సులువుగా విజయం సాధిస్తాడని ఆ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతటి మో డీ ప్రభావంలోనూ బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ఇప్పుడు మోడీ చేతిలో ఆలీ బా బా అద్భుత దీపం ఏమీ లేదని.. తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం న్యాయం చేయలేదనే భావన జనంలో బలంగా నాటుకుపోయింది. మోడీ హవా క్రమేపీ తొలగిపోయింది. మోడీని చూపించి ఓట్లు అడిగే పరిస్థితే లేదు. రాష్ట్రంలో 2014లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. 2019 వచ్చే నాటికి కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. అదీ కూడా హైదరాబాద్‌లోనే.. అంటే బీజేపీ కేవలం రాష్ట్ర రా జధాని పరిధిలోనే తన ప్రభావాన్ని అంతో ఇంతో చూపించే పరిస్థితి ఉంటుంది. అంతేకానీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఆ పార్టీ గెలిచే స్థాయిలో కనిపించడంలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోటీ చేసిన 14 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. మహబూబ్‌నగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 ని యోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్‌కు 5,74,817 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 2,93,170 ఓట్లు వచ్చా యి. బీజేపీకి కేవలం 62,634 ఓట్లు మాత్రమే వచ్చాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఆ పార్టీ అ భ్యర్థికి దారుణంగా 3,601 ఓట్లు మాత్రమే వచ్చా యి. ఇక నాగర్‌కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 6,36,002 ఓట్లు, కాంగ్రెస్‌కు 4,44,084 ఓట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం 86,813 ఓట్లు మాత్రమే లభించాయి. గద్వాలలో ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 1,936, ఆలంపూర్‌లో 1,965 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ గణాంకాలన్నీ బీజేపీ తాజా పరిస్థితిని వివరిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో వాళ్ల గ్రాఫ్ పెరిగేందుకు అవకాశం లేదని ఈ లెక్కలే చెబుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నుంచి బీజేపీ కొంచెమన్నా మెరుగవ్వాలనే ఆలోచనతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.

ముక్కోణపు పోటీలో టీఆర్‌ఎస్‌దే హవా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముక్కోణపు పోటీలో టీఆర్‌ఎస్ పార్టీకే మేలు జరిగే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో నూ అదే నిరూపితమైంది. తాజాగా ము గిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీలేవీ టీఆర్‌ఎస్ దరిదాపుల్లో కూడా లేవు. ఉన్న ఒక్క సీటూ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికతో జిల్లాలో పార్టీ బలం 14కు చేరింది. డీకే.అరుణతో పాటు కాం గ్రెస్ క్యాడర్ సింహభాగం బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ బలహీన పడనున్నది. రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక ఏర్పడుతుంది. కొంత మేర ఉండే అవకాశం ఉన్న ప్రభు త్వ వ్యతిరేక ఓటును కైవసం చేసుకుని లబ్ధి పొం దుదామని ఆశ పడ్డ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఎంత పుంజుకున్నామని భావించినా బీజేపీ పరిస్థితి మా త్రం గెలిచే స్థాయిలోకి రావడం అంత సులభం కాదు. ఇన్ని సమీకరణల నేపథ్యంలో బలంగా ఉన్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 4 లక్షలు, మహబూబ్‌నగర్ సెగ్మెంట్ పరిధిలో 3 లక్షల మెజార్టీ లభించింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ దార్శనికత రాష్ర్టానికి దారిచూపుతోంది. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉంటున్నారు. ఈ పరిణామాలన్నీ టీఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు సంకేతంగా చెప్పొచ్చు.

67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles