భూసమస్యల పరిష్కారానికి చర్యలు

Thu,March 21, 2019 01:55 AM

అయిజ : జిల్లాలో భూసమస్యల పరిష్కారానికి కలెక్టర్ శశాంక ఆదేశాల మేర కు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో రాములు పేర్కొన్నారు. బుధవారం అ యిజ మపట్టణంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సమస్యలపై సమీక్ష చేశారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 22,842 ఖాతాలు ఉండ గా, 16,572 ఖాతాలకు పట్టాదార్ పా స్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. భూప్రక్షాళనలో సమగ్రమైన నివేదిక ఆధారంగా అన్ని ఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నిక ల వేళ భూసమస్యలను పరిష్కరించడంలో కొంత ఆలస్యం అయినమాట వాస్తమేనన్నారు. ప్రస్తుతం పార్ల మెంట్ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యం త్రాంగం నిమగ్నమైనప్పటికీ సమయం దొరికినప్పుడల్లా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పెం డింగ్ సమస్యలను మూడు రోజుల్లో ని వేదిక రూ పంలో అందజేయాలని వీఆర్‌వోలను ఆదేశించారు. ముగ్గురుతో కూడిన ఒక టీంను ఏర్పాటు చేసి భూసమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను సమన్వ యం చేసుకుని కోర్టు కేసులు, డబుల్‌ఖాతాలు మినహా అర్హులైన ప్రతి రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం అందించేందు కు చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో 1656 ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, 106 ఖా తాలకు డిజిటల్ సిగ్నేచర్ లేకపోవడం, 6 ఖాతాలు జరిచేయా ల్సినవి ఉన్నాయన్నారు. సాధ్యమైనంతమేరకు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించేందుకు చర్యలు తీ సుకోవాలన్నారు. మరో వారం రోజులలో సమీక్ష చేయనున్నట్లు ఆర్డీవో వెల్లడించారు. అంతకుముందు రైతులు ఆర్డీవోను కలిసి తమ సమస్యలను చె ప్పుకున్నారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రై తులు సంయమనం పాటించి రెవె న్యూ సిబ్బందికి సహకరిస్తే భూ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఈ స మావేశంలో తహసీల్దార్ కిషన్‌సింగ్, ఆర్‌ఐ లక్ష్మీరెడ్డి, వీఆర్‌వో తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles