జాబ్‌కార్డు కలిగిన ప్రతికూలీకి పని కల్పించాలి

Thu,March 21, 2019 01:55 AM

అయిజ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగిన ప్రతికూలీకి పనికల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీడీ నాగలింగాచారి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సిబ్బందితో సమీక్ష చేశారు. ఉపాధి హామీ పథకం కింద శాశ్వత పనులను చేపట్టాలన్నారు. నీటి కుంటల నిర్మాణాలు, చెరువుల కాల్వల ఆధునీకరణ, కాల్వ లో పూడికతీత పనులు, బా వులలో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. నీటి నిల్వ లు పెంచేందుకు ఫాంఫండ్ ప నులు చేపట్టాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐదో విడత లో ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏ డాది ప్రతి జీపీలో ఒక నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మండలంలోని 28 జీపీలలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నర్సరీలలో మొక్కలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జూన్, జులై నాటికి మొక్కలు ఏపుగా పెరిగేందుకు నర్సరీల నిర్వహకులను కోరాలన్నారు. మండలంలో భూగర్భజలాలు అడుగంటి పోకుండా ఉండేందుకు ఎక్కడపడిన వర్షపునీరు అక్కడే ఇంకిపోయేలా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించేందుకు మండలానికి మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణాల కోసం మెటీరియల్‌ను సిద్ధం చేశామన్నారు. అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను సద్వినియో గం చేసుకుని ఈ నెల చివరి నాటికి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సాయిప్రకాష్, ఏపీవో శ్రీనివాస్‌గౌడ్, ఈసీ సందీప్, టీఏలు, ఎఫ్‌ఏలు తదితరులుపాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles