ప్రశాంతంగా కొనసాగుతున్న పది పరీక్షలు

Thu,March 21, 2019 01:54 AM

గద్వాల న్యూటౌన్ : జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ శశాంక, ఇన్‌చార్జి డీఈవో సుశీంద్ర రావులు పదో తరగతి పరీక్షా కేం ద్రాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం తో మాస్ కాపీయింగ్ అవకాశాల్లేకుం డా పరీక్షలు విద్యార్థులు ప్రశాంతంగా రాస్తున్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు వి ద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరి స్తున్నారు. ఇదిలా ఉం డగా బుధవారం జరిగిన ఇంగ్లీష్ పేప ర్-1 పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 7,550 మంది విద్యార్థులు హాజరవ్వా ల్సి ఉండగా 7,519 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది విద్యార్థులు హాజరుకాలేదు. అదే విధంగా 140 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజ రు కావాల్సి ఉండగా 123 మంది వి ద్యార్థులు హాజరయ్యారని, 17మంది హాజరుకాలేదని జిల్లా పరీక్షల కమిటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, ఇన్‌చార్జి సీతారామారావులు విలేకరుల తో తెలిపారు. మొత్తానికి 99.58 శాతం రెగ్యులర్ విద్యార్థులు, 87.85శాతం ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజర య్యారు. జిల్లా కేంద్రంలోని విశ్వభారతి ఉన్నత పాఠశాల, ఇం డో ఇంగ్లీష్, మోమిన్‌మహల్లా, శారద ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప రీక్షా కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు జిల్లాలోని గట్టు, నందిన్నె, పాతపాలెం, ధరూర్, ఇటిక్యా ల, శాంతినగర్, రాజోళిలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
- ఆర్డీవో రాములు
అయిజ : పదో పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో రాములు చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న పదో పరగతి పరీక్షల కేంద్రాలను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, బ్రైట్‌స్టార్ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో కాపియింగ్‌కు తావు ఇవ్వరాదన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా చూడాలన్నారు. పరీక్ష కేం ద్రాలలో తాగునీరు అందుబాటులో ఉం చాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా కరెంట్ కొరతలేకుండా చూడాలన్నారు. వైద్యులను అందు బాటులో ఉంచాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. చీఫ్‌లు పరీక్ష గదులపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కిషన్ సింగ్, చీఫ్‌లు, డీవోలు ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles