టార్గెట్ మార్చి 31..!

Wed,March 20, 2019 12:47 AM

-పన్ను వసూలుకు తరుముకొస్తున్న గడువు
-ఇప్పటివరకు రూ.2.94 కోట్లు వసూలు
-ఇంకా రూ. 89.39 లక్షలు బకాయి
-లక్ష్యం పూర్తిచేస్తామంటున్న అధికారులు
గద్వాలటౌన్ : మున్సిపాలిటి పరిధిలో మొత్తం 12582 ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఏటా రూ. 3కోట్లు లక్ష్యం. ఇప్పటి వర కు రూ. 2కోట్ల 94లక్షల 51వేలు వసూ ళ్లు అయ్యాయి. ఇంకా రూ.89లక్షల 39వేలు బకాయిలు ఉన్నాయి. ప్రతి ఏ టా కోట్లాది రూపాయలు మున్సిపాలిటీ ఖజానాలో జమ కావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా జమ కాలేక పోతున్నాయన్న విమర్శలు కౌన్సిల్ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో వసూళ్లను వేగవంతం చే యాల్సిన బాధ్యత అధికారులపై ఎంతై నా ఉందన్న అభిప్రాయాలు కౌన్సిల్ నుంచి వ్యక్తమవుతున్నాయి.

వసూళ్లు కాని ప్రభుత్వ కార్యాలయాల పన్ను..
మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 117 ప్రభుత్వ కా ర్యాలయాలు, కేంద్రప్రభుత్వానికి సం బంధించిన కార్యాలయాలు 3 ఉన్నా యి. మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు 120 ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా రూ.50లక్షలు వసూళ్లు కావాల్సి ఉంది. కాని ఇంతవరకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో వసూళ్లు కాలేదు.

రైల్వే శాఖ పన్నుపై దృష్టి ఏది..?
నగరపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రేల్వేస్టేషన్లకు వాటి క్వార్టర్స్‌కు స్థాయిని బట్టి సేవాపన్నులు వసూళ్లు చేయాలని 2009నవంబర్‌లో సుప్రీంకోర్టు మున్సిపల్‌శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2010లో ఆయా నగర పంచాయతీల, మున్సిపల్ పరిధిలో ఉన్నా రైల్వేఆస్తులకు సేవాపన్నును వేయాలని నిర్ణయం తీసుకుంది. స్టేషన్ల స్థాయిని బట్టి 25శాతం నుంచి 33శాతం వరకు పన్నులు వసూళ్లు చే యాలని నిర్ణయించారు. అయితే ము న్సిపల్ అధికారులు ఆ అవకాశాన్ని పూ ర్తిగా పోగొట్టుకుంటున్నారు. అంతేకాక తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గద్వాల మున్సిపాలిటీ ప్రతి ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది. అ యితే అధికారులు మాత్రం సంబంధిత శాఖ అధికారులకే నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు.

ఖాళీల స్థలాల పన్ను అసలే లేదు...
అధికారుల లెక్కల ప్రకారం 126 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాది రూ.1.64లక్షలు రావాల్సి ఉంది. కాని ఇంతవరకు అధికారులు ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై దృష్టి సారించలేదు. ఏండ్లుగా బకాయిలు అలాగే ఉన్నాయి.

పన్నులు ఇలా...
నివాసాలు 12582 ఉండగా రూ.2 కో ట్ల 27లక్షల77వేలు వసూళ్లు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 1కోటి 72లక్షలు వసూళ్లు అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు 120 ఉ న్నాయి. వాటి నుంచి రూ.50లక్షలు రా వల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.24లక్షలు వసూళ్లు అయ్యాయి. ఖాళీ స్థలా లు 126ఉన్నాయి. వాటి నుంచి రూ. 1.60లక్షలు రావాల్సి ఉంది. ఇంకా వాటిపై దృష్టి సారించలేదు. పాత బకాయిలు రూ.66.74లక్షలు వసూళ్లు కా వాల్సి ఉండగా రూ.37లక్షలు వసూళ్లు అయ్యాయి. మొత్తం మీద మున్సిపాలి టీ ఏడాదికి వసూళ్లు కావాల్సిన పన్ను లు దాదాపు రూ. 3కోట్లు. ఇప్పటి వర కు మొత్తం మీద రూ.2కోట్ల50లక్షలు వసూళ్లు అయ్యాయి. కాగా ఇప్పటి వర కు 70శాతం వసూళ్లు అయ్యాయి. ఇం కా రూ.89లక్షల 39వేలు వసూళ్లు చే యాల్సిన ఉంది. ఈ మొత్తాన్ని కూడా నిర్ణీత సమయంలో వసూళ్లు చేసి లక్ష్యా న్ని చేరుకుంటామన్న ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరిని ఊపేక్షించేది లేదు..
వసూళ్లలో ఎవరిని ఉపేక్షించేది లేదు. వసూళ్లుపై ప్రత్యేక దృష్టి సారించడం జ రిగింది. వసూళ్లకై 5టీంలను నియమించడం జరిగింది. అంతేకాక ప్రత్యేక ఆ టోలు , మున్సిపాలిటి వాహనాలు , సిబ్బంది ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తు న్నాం. నిర్ణీత సమయంలోపు లక్ష్యాన్ని తప్పక చేరుకుంటాం. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలి.
-కమిషనర్ శ్రీనివాసరావు

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles