పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

Wed,March 20, 2019 12:46 AM

-స్కాడ్‌లు విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు
-కలెక్టర్ శశాంక
-జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రం పరిశీలన
-జిల్లాలో 99.56 శాతం హాజరు
-పలు కేంద్రాల్లో ఇన్‌చార్జి డీఈవో తనిఖీ
గద్వాల, నమస్తే తెలంగాణ : పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్‌లు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశా లలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్‌లో ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ప్రస్తుతం పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు. పరీక్షలు సజావుగా నడుస్తున్నాయా లేదా అని పరీక్ష సూపరింటెండెంట్, సిట్టింగ్ స్కాడ్ లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి నీరు, ప్రాథమిక వైద్య కిట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనే వాటిని కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరుగకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ సిట్టింగ్ స్కాడ్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్కాడ్ తప్పని సరిగా ఉండాలన్నారు. సిట్టింగ్ స్కాడ్ ఉండాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరీక్షా కేంద్రంలో లేక పోవడం ఏమిటని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య కేంద్రంలో మందులను పరిశీలించారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles