ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

Mon,March 18, 2019 11:52 PM

-ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి
ఇటిక్యాల: 18 సంవత్సరాలు పైబడి ఓ టుహక్కు కలిగిన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి సూచించా రు. మండంలోని ఉదండాపురం, చాగాపు రం గ్రామాల్లో వీవీ ప్యాట్‌లు ఓటుహక్కు వినియోగంపై ఆయన సోమవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలనుద్ధేశించి ఎంపీడీవో ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగంతోనే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొనే అవకాశముందన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగంగా వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు అనుసంధానంగా వీవీ ప్యాట్లు పనిచేస్తున్నాయన్నా రు. ఓటు వేయాలనుకునే అభ్యర్థి పార్టీ గు ర్తుతో పాటు ఫొటోను కూడా బ్యాలెట్ యూనిట్‌లో పొందుపరచబడి ఉంటుంద న్నారు. దీంతో పాటు ఓటు నిర్ధారణ చేసు కునేందుకు పక్కనే వీవీ ప్యాట్ ద్వారా తె లుసుకోచ్చని అన్నారు. వీవీ ప్యాట్‌లో ఓట రు ఓటు వేసి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ముద్రించబడిన కాగితాన్ని 7 సెకన్ల పాటు ప్రదర్శిస్తుందన్నారు. దీని ద్వారా తాము ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేసామో నిర్ధారించు కోవచ్చన్నారు. ముఖ్యంగా వీవీ ప్యాట్ల ద్వా రా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో మన ము ఏ గుర్తుకు ఓటు వేశామో తెలుసుకొనే అవకాశముందన్నారు. ఈ సందర్భంగా ఆయ న వీవీప్యాట్లపై గ్రామస్తులకు ఉన్న సందేహాలనునివృత్తిచేశారు. ఉదండాపురం చాగాపురం, గ్రామస్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles