పారదర్శకతకు సీ-విజిల్ యాప్ వజ్రాయుధం

Mon,March 18, 2019 11:52 PM

-జిల్లా సంయుక్త కలెక్టర్ జే నిరంజన్
గద్వాల న్యూటౌన్ : ప్రజాస్వామ్య పరిక్షణలో పా రదర్శకతకు సీ-విజిల్ యాప్ ఒక వజ్రాయుధం వంటిదని జిల్లా సంయుక్త కలెక్టర్ జే నిరంజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన గద్వాలలోని ప్రి య దర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ఆయ న ఆర్డీవో రాములుతో కలిసి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీ-విజిల్, పోష ణ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘనకు గురికాకుండా ఉండేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల జరిగిన అసె ంబ్లీ ఎన్నికల్లో సీ-విజిల్ యాప్‌ను ప్రవేశపె ట్టడం జరిగిందన్నారు. ఈ యాప్‌తో ఎన్నికల్లో ఎక్కడైన నిబంధనలకు పాతరవేసినట్టు ఓటర్లకు తెలిస్తే అందులో సమాచారంతో పాటు ఫోటోలను కూడా పంపవచ్చన్నారు. ఈ యాప్‌ను అవగాహన చేసుకు న్న విద్యార్థులకు తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలన్నారు.

పోటీలో నిలబడే అభ్య ర్థులు ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ యాప్‌లో పొందుపరిచిన వివరాలే ఆధారమ వు తాయన్నారు. తప్పు చేసిన ఏ అభ్యర్థి కూడా సీ -విజిల్ యాప్ నుంచి తప్పించుకోవడం జరుగుద న్నారు. అనంతరం గద్వాల ఆర్డీవో రాములు మా ట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి ద్వా రా ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ అధికార మా ర్పిడి అనేది స్వచ్ఛమైన ఎన్నికల ద్వారానే ఏర్పడు తుందన్నారు. ఇప్పటి వరకు ఓటు హక్కు కలిగి ఉం డి ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోని వారికి ఎన్నికల కమిషన్ ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పించిందన్నారు. ఫారం-6 పూర్తి చేసి, లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీవో విద్యార్థినులకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల న్నారు. దిలా ఉండగా అధికారులు పోషణ్ అభి యాన్‌పై విద్యార్థినులకు పవర్‌పాయింట్ ప్రజంటే షన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్య క్రమంలో సీప్ నోడల్ అధికారి పద్మావతి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపతినాయుడు, కళాశాల అధ్యాపకు లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles