ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

Mon,March 18, 2019 11:51 PM

- ఏఎస్పీ కటుకూరి కృష్ణ
గద్వాల క్రైం : ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ప్రజావాణిని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కటుకూరి కృష్ణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం గద్వాలలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో సోమవారం ఏఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసుల విషయంలో సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు రక్షణగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. ఫిర్యాదు చేసే విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ కర్తవ్యమని ఏఎస్పీ బాధితులకు వివరించారు. ఇదిలా ఉండగా వివిధ సంఘటనలకు సంబంధించిన 9 ఫిర్యాదులను పరిశీలించిన ఏఎస్పీ, వాటిని విచారించి పరిష్కరించాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఆదేశించారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles