పది పరీక్షా కేంద్రం తనిఖీ

Mon,March 18, 2019 11:50 PM

-పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా..
-అనంతపురంలో ఇన్‌చార్జి డీఈవో సుశీంద్రరావు
-రెండో రోజూ పరీక్షలు ప్రశాంతం
-99.45 శాతం విద్యార్థుల హాజరు
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
గద్వాల క్రైం : పదో తరగతి పరీక్ష లు రెండో రోజూ రెండో రోజు 99. 45 శాతం విద్యార్థులు పరీక్షకు హా జరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీ క్షా కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బ ందులు తలెత్తలేదు. జిల్లా ఇన్‌చార్జి వి ద్యాశాఖాధికారి సుశీంద్రరావు గద్వా ల మండలం అనంతపురం గ్రా మంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ, ఏర్పాట్ల గు రించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశా రు. సోమవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన తెలుగు పేపర్-2 పరీక్షకు 7, 588 మంది విద్యార్థులు హాజరు కా వాల్సి ఉండగా, 7,546 మంది వి ద్యార్థులు హాజరయ్యారని, 42 మం ది విద్యార్థులు హాజరు కాలేదని సు శీంద్రరావు పేర్కొన్నారు.

స్ట్రాంగ్ రూంను సీజ్ చేసిన ఇన్‌చార్జి డీఈవో
జిల్లా కేంద్రమైన గద్వాలలోని పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూం నుంచి సె క ండ్ స్పెల్ (చివరి స్పెల్) ప్రశ్నా పత్రా ల బండిల్స్‌ను సోమవారం ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి సుశీంద్రరా వు ఆధ్వర్యాన పోలీసు బందోబస్తుతో ప్రత్యేక వాహనాల్లో సంబంధిత పోలీ సు స్టేషన్లకు తరలించారు. ఏ రోజు జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను జిల్లాలోని 38 పరీక్షా కేంద్రాల సీఎస్‌లు అదే రోజు సంబంధిత పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని సుశీంద్రరావు పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాల బండిల్స్ తరలింపు అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూం ను ఇన్‌చార్జి డీఈవో సమక్షంలో అధికారులు సీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, డీఈవో కార్యాలయ ఏడీ ఇందిర, పరీక్షల సెక్షన్ ఇన్‌చార్జి సీతారామారావు, సిబ్బంది మ హంకాళి శ్రీనివాసులు, కార్తీక్‌శర్మ, ఎంఈవోలు ప్రతాప్‌రెడ్డి, రాజు, కొం డారెడ్డి, శివప్రసాద్ పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles