హత్యకు గురైన వృద్ధురాలి గుర్తింపు

Mon,March 18, 2019 11:50 PM

ఉండవెల్లి/గోపాల్‌పేట: ఆదివారం హత్యకు గురైన వృద్ధురాలిపై నిప్పుంటించిన మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించిన్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఏఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం ఏదుల గ్రామానికి చెందిన నర్సయ్య, భార్య కొమ్మరాజ్యమ్మ (70) 16వ తేదీన ఆరోగ్య బాగు కోసం వనపర్తిలో మందులు కొనేందుకు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర ఆరా తీసినా ఆచూకి లభించలేదు. నమస్తే తెలంగాణ పత్రికలో సోమవారం వచ్చిన మృతురాలి ఫొటో, చేతి వేలి ఉంగరం వంటి ఆనవాళ్ళను కుటుంబ సభ్యులు గుర్తించి ఉండవెల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అలంపూర్ మార్చురీ గదిలో భద్రపర్చిన మృతదేహాన్ని కుటుంబసభ్యులు చూసి కొమ్మరాజ్యమ్మగా గుర్తించారు. మృతురాలు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒంటిమీద మూడు తులాల బంగారం, వెండి వస్తువులు ధరించి ఉందని, వాటి కోసమే గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో చంపి ఉండవెల్లి ఆర్డీస్ కాలువ పక్కన పడవేసి, పెట్రోలు పోసి నిప్పుంటించి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అలంపూర్ దవాఖానలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ పరిణామంతో ఏదుల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles