పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి తరలిరండి

Mon,March 18, 2019 01:25 AM

అయిజ : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు ఈ నెల 19న మంగళవారం అలంపూర్ చౌరస్తాలో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని ఆయన స్వగృహంతో టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ నియోజక వర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో స న్నాహక సమావేశాలు నిర్వహి స్తున్నట్లు, అందులో భాగంగానే ఈ నెల 19న అలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ని టీఆర్‌ఎస్ శ్రేణులను ఎన్నికలకు సన్న ద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సారి ఎలాగైన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉత్తేజపర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ చిన్న హనుమంతు, టీఆర్‌ఎస్ నాయకులు ప్రహ్లాదరెడ్డి, భాస్కర్‌గౌడ్, జయన్న, భద్రయ్య, శ్రీను, కృష్ణారెడ్డి, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles