అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇళ్లు

Mon,March 18, 2019 01:24 AM

- ఇళ్ల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి
-త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయండి
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-అధికారులు, కాంట్రాక్టర్‌లకు ఆదేశాలు
గద్వాల, నమస్తే తెలంగాణ : అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి పరుమాల శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడి చేశారని, తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికైతే వాస్తవంగా ఇళ్లు లేదో విచారణ చేసి ఇల్లు ఇస్తామని చెప్పారు. పేదవారి సొంతింటి కల నిజం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లు నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని సూచించారు. మన ఇంటి నిర్మాణాలు ఎలా చేపడుతామో పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా అలాగే నిర్మించాలని ఆదేశించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు పదికాలాల పాటు పటిష్టంగా ఉండాలన్నారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు.

ఇళ్ల నిర్మాణ సమయంలో క్యూరింగ్ మంచిగా చేయాలని చెప్పారు. పేదలు తమ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారని త్వరలో వారి నెరవేరే విధంగా పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్మాణాలను అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తుటే కాంట్రాక్టర్ నిర్మాణాలు నాణ్యతతో చేపడతారని అన్నారు. ఇంటికీ మంచి స్టీల్‌తో పాటు ఇసుక వాడాలని సూచించారు. అనంతరం చేపడుతున్న పనులు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతతో చేపడుతున్నారా లేదా, ఇంటికి అమర్చే కిటికీలు, తలుపులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం అక్కడ పని చేస్తున్న కూలీలతో మాట్లాడి రోజు వారి కూలీ ఎలా ఉందని అడిగి తెలుసుకోవడంతో ఎండలు ఎక్కువగా ఉన్నందున పనులు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు. ఎమ్మెల్యే వెంట ధరూర్ నర్సింహారెడ్డి, మహిమూద్ తదితరులు ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles