పేదోడి చెంతకు.. మెరుగైన వైద్యం..!

Sun,March 17, 2019 12:39 AM

-కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంలా డయాలసిస్ కేంద్రం
-ఏడాదిన్నరగా గద్వాల ఏరియా దవాఖానలో చికిత్సలు
-జిల్లాలో 100 మందికి 6,276 సార్లు వైద్యం
-దేశంలో మొదటిసారి సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ వినియోగం
-సర్కార్ సేవలపై సర్వత్రా హర్షం
జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : కిడ్నీవ్యాధి భారిన పడిన పేద ప్రజలు చికిత్సలకు నోచుకోలేక తనువు చాలిస్తున్నారు. ఒక సారి డ యాలసిస్ చేయించుకోవాలంటే ప్రైవేట్ దవాఖా నలో దాదాపు రూ.2,500 నుంచి రూ.3000 వరకు ఖర్చు చేయవల్సి వస్తుండేది. డయాలసి స్‌కు వెళ్లిన ప్రతిసారి ప్రైవేట్ దవాఖానాలో ఇంత మేరకు ఖర్చు చేయాలని కిడ్నీవ్యాధిగ్రస్తులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని డయాలసిస్‌కు దూర మవుతున్నారు. దీంతో వ్యాధి తీవ్రస్థాయికి చేరు కొని పరిస్థితులు చేజారిపోయి మృ త్యువాత సం ఘటనలు ఎన్నో ఉన్నాయి. పేద ప్రజలు ఎదు ర్కొంటున్న ఈ భయంకరమైన పరిస్థితులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యా ధునిక టెక్నాలజీతో అధునాతన పరికరాలను స మకూర్చి జిల్లా కేంద్రంలోని ఏరియా దవా ఖా నలో కూడా ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని ఏ ర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని 2017 నవంబర్ లో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి ప్రా రంభించారు. ఆ తరువాత 2018 జనవరి నుంచి పూర్తి స్థాయిలో సదుపాయాలను ఏర్పాటు చే సుకొని గద్వాల ఏరియా దవాఖాన లో వైద్యులు డయాలసిస్ సేవలను అందిస్తు న్నారు.

గద్వాల దవాఖానలో 6,276 సార్లు డయాలసిస్..
జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో డ యాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్పటిన నుం చి దాదాపు ఏడాదిన్నరగా విజయవంతంగా డ యాలసిస్ చికిత్సలు అందిస్తున్నారు. గద్వాల ఏరి యా దవాఖానలో మొత్తం 5 డయాలసిస్ మిషన్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 4 నెగటివ్ మిషన్లు ఉండగా ఒకటి పాసిటివ్ మిషన్ ఉంది. ఇప్పటి వరకు 100మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 6,276 సార్లు డయాలసిస్ చికిత్సలను చేశారు. ఇక్కడి డయాలసిస్ కేంద్రంలో నిత్యం 19 నుంచి 21 మంది వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటుడగా నెలలో సరాసరి 480 నుం చి 500 మందికి డయాలసిస్ చేస్తున్నారు. 2018 లో జనవరి నుంచి పూర్తి సదుపాయాలతో డయా లసిస్ చికిత్సలను అందిస్తున్నారు. నెలనెల వారి గా 2018 జనవరిలో 161 సార్లు, 2018 ఫిబ్ర వరిలో 407 సార్లు, మార్చిలో 427సార్లు, ఏప్రిల్ లో 426 సార్లు, మేలో 468 సార్లు, జూన్‌లో 455 సార్లు, జులైలో 446 సార్లు, ఆగస్టులో 462 సార్లు, సెప్టెంబర్‌లో 455 సార్లు, అక్టోబర్ లో 489 సార్లు, నవంబర్‌లో 473 సార్లు, డిసెం బర్‌లో 465 సార్లు, 2019 జనవ రిలో 490 సార్లు, ఫిబ్రవరిలో 452 సార్లు, మార్చిలో ఇప్పటి వరకు 220 సార్లు డయాలసిస్ చికిత్సలు అందిం చారు.

రోగులకు మెరుగైన సదుపాయాలు
డయాలసిస్ కోసం ఏరియా దవాఖానకు వచ్చిన రోగులకు దవాఖాన సిబ్బంది అన్ని సదుపాయా లను కల్పిస్తుంది. ప్రతి కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి నెల లో మూడు సార్లు కిడ్నీసంబంధిత చికిత్సలు చేస్తు న్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వేల రూ పాయాల్లో ఫీజులు వసూలు చేసి అందిస్తున్న కిడ్నీ చికిత్సల ను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా పేద రోగులకు అందిస్తుంది. చికిత్సలకు వచ్చిన రోగులకు ప్రతి రోజు బ్రెడ్, పాలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ప్రతి బుధవారం భోజనంతో పాటు గుడ్లను కూడా అందిస్తున్నారు. వీటితోపాటు ప్ర భుత్వం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మరిన్ని సదుపా యాలను కూడా అందించేందుకు ఏర్పాట్లను చేస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు గ్రామాల నుంచి జి ల్లా కేంద్రంలోని ఏరియా దవఖానకు ప్రయాణం చేసేందుకు ఉచితంగా బస్ పాస్‌లను కూడా అం దించనుంది. ఈ పాస్ ద్వారా కిడ్నీవ్యాధిగ్రస్తులు తమ గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా జిల్లా కేంద్రానికి ప్రయాణం చేయవచ్చు. ఈ సదు పాయాన్ని ప్రభుత్వం అతిత్వరలోనే అందుబా టులోకి తీసుకురానుంది.

ఇంతక ముందు మహబూబ్‌నగర్‌కు వెళ్లేది
కిడ్నీవ్యాధి వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా చాలా నష్టపోయాను. చికిత్స చేయించు కునేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లేది. వెళ్లినప్పుడల్లా రూ.2000 వరకు ఖర్చయ్యేవి. ఇప్పడు గద్వాల ఏరియా దవాఖానలో డయా లసిస్ కేంద్రం మాకు వరంలా మారింది. మా గ్రామం సాతర్ల నుంచి గద్వాలకు వచ్చేందు కు కేవలం రూ.50 ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉచితంగా డ యాలసి స్ చేస్తున్నారు. నాణ్యమైన ఖరీదైన వైద్యాన్ని వైద్యులు అందిస్తు న్నారు. చికిత్సలతో పాటు భోజనం కూడా పెడుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది.
- తిమ్మప్ప, సాతర్ల గ్రామం

ఖర్చులు భరించలేక పోయేవాళ్లం..
ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు రూ.2,500 వరకు ఖర్చయ్యేవి. చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లేవా న్ని అక్కడి ప్రైవేట్ దవాఖానకు వెళ్లితే ఆ రోజంతా అక్కడి ప్రైవేట్ వైద్యులు నిలువుదోపిడి చేసేవాళ్లు. ఈ ఖర్చులను భరించలేక ఒక్కో సారి చికిత్సలకు వెళ్లకుండా ఉండేది. గద్వాల డయలాసిస్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి కష్టాలన్నీ తొలిగిపోయాయి. ఇంత మంచి సౌకర్యం కలిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటి రుణపడి ఉంటాను. త్వరలోనే బస్‌లో ప్రయాణించేందుకు బస్‌పాస్‌లను కూడా అందిస్తామని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకంటే మంచి సదుపాయాలు ఇంక ఏం ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది.
- నాగరాజు, అయిజ

నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నాం..
జిల్లాలోని కిడ్నీవ్యాధిగ్రస్తులకు దాదాపు 100 మందికి డయాలసిస్ చికిత్సలు అందిస్తున్నాం. ఒక్కో రోగికి నెలలో కనీసం మూడు డ యాలిసిస్ చికిత్సలు అంది స్తున్నాం. ఇలా రోజుకు 20మంది వరకు డయాలసిస్ కోసం గద్వాల ఏరియా దవాఖానకు వస్తున్నారు. దేశంలో మొట్టమొదటి సారి సింగిల్ యూసుడ్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ చికిత్సలు అందిస్తున్నాం. ఈ విధానం ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులు తర్వగా వ్యాధుల నుంచి కోలుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానలో దా దాపు రూ.2,500 విలువగల చికిత్సలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నాం. గతంలో కర్నూల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ వెళ్లి చికిత్స చేయించుకునే రోగులు గద్వాల ఏరియా దవాఖానకు వస్తున్నారు.
- డాక్టర్ కిశోర్, డయాలసిస్ కేంద్రం ఇన్‌చార్జి, గద్వాల.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles