హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి

Sun,March 17, 2019 12:38 AM

-గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి
-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనోత్సవాలు
-ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బండ్ల
కేటీదొడ్డి : హిందువులు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని సోంపురం గ్రామంలోని సీతారాముల ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం అంగరంగ వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, వేద బ్రహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో హిందూ ధర్మాన్ని చాటుతూ ధ్వజస్తంభం ప్రతిష్టించారన్నారు. అ లాగే హిందూ సాంప్రదాయాన్ని హిందువులు గౌరవించాలని కోరారు. గ్రామాల్లో అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పెద్దలందరి అభిప్రాయాలు తీసుకొని ఇలాగే సంకల్పంతో పని చేస్తే గ్రామ అభివృద్ధి సులవవుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్ప ంచ్ తిక్కన్న, గట్టు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, ఉరుకుందు, రఘుకుమార్‌శెట్టి పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles