మండల పరిషత్ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం

Sun,March 17, 2019 12:37 AM

-16 ఎంపీటీసీల పరిధిలో 41,821 వేలు
-పంచాయతీలలో డ్రాప్టు నోటిఫికేషన్ ప్రదర్శన
అయిజ : మండల పరిషత్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమాయాత్తమవుతున్నది. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఓటర్ల జా బితాను సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 22న ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా సరిచేసిన ఓటరు డ్రాప్టు నోటిఫికేషన్‌ను శనివారం మండలంలోని 28 జీపీలలో పంచాయతీ కార్యదర్శులు ప్ర దర్శించారు. ఈ నెల 18 వరకు ఓటరు జాబితాపై అభ్య ం తరాలను స్వీకరించనున్నారు. అనంతరం అంభ్యతరాల ను పరిష్కరించి ఉన్నతాధికారుల ఆమోదం మేరకు తుది జాబితాను ప్రకటించనున్నారు. అయిజ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 28 జీపీలు ఉ న్నాయి. వీటిలో 41,821 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 20,942 మంది పురుషులు, 20,879 మంది స్త్రీలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో జరుగనున్న దృష్ట్యా ఏఫ్రిల్ మూడు, నా లుగో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సం ఘం కసరత్తు చేస్తుండటంతో అధికార యం త్రాం గం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఓటుహక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల చివరి నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎంపీడీవో సాయిప్రకాశ్ తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles