ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలి

Sun,March 17, 2019 12:37 AM

-ఎంపీపీ సుందర్‌రాజు, చైర్ పర్సన్ రాజేశ్వరి
అయిజ : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉం దని ఎంపీపీ సుందర్‌రాజు, పురపాలిక చైర్ పర్సన్ రాజేశ్వరిలు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వి ద్యార్థినులకు స్టాస్ ఫౌండేషన్ ప్రతిని ధి నరేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని ఎంపీపీ, చైర్ పర్సన్ లు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో రాణిస్తుంటారని, వారికి స్వచ్ఛంద సంస్థ లు సహకారం అందిస్తే ఉత్తమ ఫలితా లు సాధించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. స్టాస్ ఫౌండేషన్ కేజీబీవీ విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందించేందుకు ముందు కు రావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ఎక్కువ గ్రేడ్లు సాధించి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమ ంలో పీఈటీలు మధు, అరుణతార, ఉపాధ్యాయు లు, విద్యార్థినులు పాల్గొన్నారు.
పదిలో విజయకేతనం ఎగురవేయాలి
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలలో కేజీ బీవీ విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించి వి జయకేతనం ఎగురవేయాలని ఎంపీపీ సుంద ర్‌రా జు, పురపాలిక చైర్ పర్సన్ రాజేశ్వరిలు కేజీబీవీ వి ద్యార్థినులను కోరారు. శనివారం పదోతరగతి పరీ క్షలు ప్రారంభం అవడంతో విద్యార్థినులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పీఈటీలు మధు, అ రుణ తార, నరేష్‌రెడ్డి పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles