వేసవి దృష్ట్యా.. నీటి కొరత లేకుండా చూడాలి

Sun,March 17, 2019 12:37 AM

-పశు సంవర్ధక శాఖాధికారులు, డాక్టర్లతో కలెక్టర్ శశాంక సమీక్ష
గద్వాల న్యూటౌన్ : పశు సంపద అధికంగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో వేసవి కాలం దృష్ట్యా పశువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటికి సరిపడ మేత, నీటి సౌకర్యంతో పాటు పశువులకు రోగాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక సంబంధితాధికారులకు, వైద్యులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఆయన పశుసంవర్ధక శాఖాధికారులు, వైద్యులతో సమీక్ష సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా నిర్దేరిం చిన సబ్సిడీ గొర్రెల యూనిట్లు అనుకున్నస్థాయిలో గ్రౌండింగై ఉన్నందున ఉన్న పశు సంప దను కాపాడుకుని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అధికారులు, వైద్యులు చర్యలు తీసు కోవాలన్నారు. ఎండా కావడంతో పశువులకు ఎంత మేత అవసరం? ఎక్కడి నుంచి తీసు కువస్తున్నారో అన్న విషయాలను ఆయన వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 8 మెట్రిక్ టన్నుల పశువుల దాణా రావడం జరిగిందని, పంపిణీ కూడా చేయడం జరి గిం దని వారు కలెక్టర్‌కు వివరించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా నీటి ట్రబ్బులు అవసర మవుతాయో సంబంధితాధికారులతో సమన్వయపర్చుకుని నిర్మించుకోవాలని సూచించా రు. పశువులకు షెడ్లు, సామూహిక షెడ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని, ఏఏ మం డలాల్లో ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి వాటిని నిర్మించుకోవాలన్నారు. ప్రైమరీ వెటర్నరీ సెంటర్లను ఆధునీకరించుకోవాలని గతంలో ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పు రోగతి లేదని ఆయన అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్రైమరీ వెటర్న రీ సెంటర్ పరిధిలో ఎన్ని పశువులు ఉన్నాయో? ఏ రకమైన పశువులు ఉన్నాయో? వాటికి రోగాలు వస్తే సరిపడ మందులు ఎంత కావాలి? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందన్న విషయాలతో కూడిన సమగ్ర నివేదిక తయారు చేసుకుని ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పార్ట్-ఏ, పార్ట్-బీ కింద ఇవ్వాల్సిన సబ్సిడీ గొర్రెలు ఇవ్వడం జరిగినందున ఇక ఇవ్వలేని వారి డీడీలను వెంటనే తిరిగి ఇచ్చి వారితో రశీదు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొత్త వాటిని ఎట్టి పరిస్థితిల్లో తీసుకోడానికి వల్లేదని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కేశవసాయి, ఏడీ సురేఖ, ప్రైమరీ వెటర్నరీ సెంటర్ల వైద్యులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles