లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రోజే..

Sun,March 17, 2019 12:37 AM

-అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలి
-వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్
గద్వాల న్యూటౌన్ : ఈ నెల 18 లోక్ సభ ఎన్నికలకు నోటి ఫికేషన్ విడుదల చేస్తున్న నేప థ్యంలో అదే రోజు రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. లో క్ సభ ఎన్నికల నోటిఫికేషన్ సం దర్భంగా అధికారులు ముం దస్తుగా అన్ని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. బ్యాలె ట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు సరిచూసుకుని ఎఫ్‌ఎల్‌సీ పూర్తి చేసుకుని మొదటి ర్యాండమై జేషన్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొత్త ఓటరు నమోదు దరఖాస్తులు, ఫారం 6ఏ, 7, 8, 8ఏలను 23లోగా పరిశీలన పూర్తి చేసి అర్హులైన వాటిని వెంటనే అప్‌లోడ్ చేసి 25వ తేదీ పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలట్‌ల ముద్రణకు సంబంధి తాధికారుల సమ న్వయంతో జిల్లాకు కావాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ముద్రణకు ప్రణాళికలు చేసుకోవాలని రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలో 20 శాతం అదనంగా ఉంచుకో వ డం జరిగిందని రజత్‌కుమార్‌కు వివరించారు. 15 వరకు వచ్చిన ఓటరు నమోదు దర ఖాస్తులను ఇప్పటికే పరిశీలన కార్యక్రమం పూర్తి చేయడం కూడా జరిగిందని, వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles