పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం

Sun,March 17, 2019 12:36 AM

- ఐసీడీఎస్ సీడీపీవో
అయిజ : పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరమని ఐసీడీఎస్ సీడీపీవో కమలాదేవి పేర్కొన్నా రు. శనివారం మండలంలోని పులికల్ గ్రా మంలో పులికల్ క్లస్టర్ స్థాయిలో పోషణ్ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ .. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అంతకుముందు మహిళా రైతు లు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు అవగాహన కల్పి ంచారు. ఈ సందర్భంగా పండ్లు, కూరగాయలు, పా లు మొదలగు వాటిని ఏర్పాటు చేసి వాటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగారాణి, అంగన్‌వాడీ టీచర్లు రుణుకమ్మ, సుధారాణి, సావిత్రి, సుశీల, పులికల్ క్లస్టర్ అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles