మనచేతుల్లోనే డిల్లీ జట్టు

Sat,March 16, 2019 02:08 AM

పెద్దమందడి: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లు అన్నారు. శుక్రవారం మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి జంట గ్రామాల్లోని షిరిడిసాయి మ ందిర ప్రథమ వార్షికోత్సవంలో మంత్రులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం కేక్ కట్‌చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థా నాలకు 16 స్థానాలు గెలుపొంది, ఇంకో సీటు మిత్రపక్షమైన ఎంఐఎం గెలుపొందడం ఖాయమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా తీర్పునిచ్చారో, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అదేమాదిరిగా తీర్పు ఇవ్వాలని అన్నా రు. ఢిల్లీ పీఠాన్ని ఎక్కించేందుకు 17 మంది ఎంపీలే కీలకం కానున్నారని, ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే తెలంగాణకు వచ్చే హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, ప్రస్తుతం తెలంగాణలో ప్రవేశపెడుతున్న రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ర్టాల్లో వివిధ పేర్లతో ప్రవేశపెడుతున్నారని వారన్నారు.

ప్రస్తుతం మండలానికి కృష్ణా జలాలు రావడంతో రైతులందరూ సంతోషంగా యాసంగి పంటలను సాగు చేస్తున్నారని, ఇటీవలే యాసంగి పంటలకు సాగునీరు సరిపోతాయో లేదో అనే ఉద్దేశ్యంతో మూడు రోజుల క్రితం కృష్ణా నీటితో ఆయా గ్రామాలలోని చెరువులను నింపడం జరిగిందని వారు తెలిపారు. రైతు కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని, రానున్న రోజుల్లో ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి, తెలంగాణ యూనియన్ నాయకులు థామస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేఘారెడ్డి, స్థానిక సర్పంచులు, నాయకులు, ఘణపురం పార్టీ మండల అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, జంగమాయిపల్లి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోండలయ్య తదితరులు ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles