ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Sat,March 16, 2019 02:07 AM

- పాలమూరు కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రతి పౌరుడూ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు 2007 నుంచి ఎన్నికల సంఘం వివిధ చర్యలు చేపట్టిందన్నారు పాలమూరు కలెక్టర్ రొనాల్డ్‌రోస్. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎస్‌పీలు, తదితరులతో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, శాంతి భద్రతల పర్యవేక్షణపై శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడతారని, అటువంటి వారిని, ప్రాంతాలను ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు, ఆవాసాలను గుర్తించడం, సమస్యలు సృష్టించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడే వారిని పరిగణలోకి తీసుకోవడం, అందుకు తగ్గ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీకి సూచించారు.

గుర్తింపు పూర్తి అయిన పిదప ఓటరుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై యాక్షన్ ప్లాన్ తయారుచేయాల్సి ఉంటుందన్నారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలను సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సెక్టోరల్ అధికారిని కలిసి సమర్పించాలన్నారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఐడిసి (ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్) జారీచేయడం జరుగుతుందన్నారు. వారు తమ ఓటు హక్కును విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రంలోనే వినియోగించుకోవచ్చని, అందుకొరకు ఫారం -12 ఎ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉండి మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నారాయణపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, స్పెషల్ కలెక్టర్ క్రాంతి, వనపర్తి ఎస్పీ అపూర్వరావు, నారాయణపేట ఎస్పీ చేతన, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles