3,356 క్వింటాళ్ల పప్పుశనగ కొనుగోలు

Sat,March 16, 2019 02:07 AM

అయిజ : పట్టణంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ సహ కారంతో అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతుల నుంచి 3,356 క్వింటాళ్ల పప్పుశనగను కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర రూ.4,620కు రైతుల నుంచి పప్పుశనగను కొనుగోలు చేస్తు న్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల నుంచి అయిజ సబ్ మార్కెట్ యార్డుకు రైతులు ప ప్పుశనగను తరలించారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నాణ్యమైన పప్పుశనగను 30 మంది రైతుల నుంచి 403 క్వింటాళ్ల పప్పుశనగను కొనుగోలు చేసినట్లు పీఏసీఎస్ సీఈవో మల్లయ్య తెలిపారు. ఇప్పటి వరకు అయిజ సబ్ మార్కెట్ యార్డులో 3,356 క్వింటాళ్ల పప్పుశనగను 234 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రైతులు నాణ్యమైన పప్పుశనగను మార్కెట్‌కు తరలించి మద్దతు ధరను పొందా లన్నారు. దళారీలకు పప్పుశనగను విక్రయించి నష్టపోకూడదనే ఉద్ద్యేశంతో ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిందని సీఈవో పేర్కొన్నారు. రైతులు పప్పుశనగ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles