హరిత లక్ష్యం చేరుకోవాలి

Sat,March 16, 2019 02:06 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేట్టిన హరితహారం కార్యక్రమంలో నిర్ణయించిన లక్ష్యం చేరుకోవాలని డీఆర్డీవో అధికారిణి జ్యోతి అన్నారు. శుక్రవారం అలంపూర్ మండలంలో ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛభా రత్, హరితహారం కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. మండలంలో చేపడుతున్న 12 నర్సరీల్లో 6లక్షల 50 వేల మొక్కలు పెంచాలని సూచించారు. ఈ టార్గెట్‌ను 6 లక్షల నుంచి 13 లక్షల వరకు పెంచే అవకాశం ఉందన్నారు. త్వరగా విత్తనాలు నాటి త్వరితగతిన మొక్కలను పెంచి నాటా డానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలిం చారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా కార్యాలయం విచ్చేసిన ఆమెకు కార్యాలయ సిబ్బంది సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సుల్తాన్, ఉపాధి సిబ్బంది టెక్నికల్ అసిస్టెం ట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎం పారిజాత, ఏపీవో విజయ శంకర్, కంప్యూటర్ ఆపరేటర్లు పరమేశ్, కల్యాణీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles