రశీదు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి

Sat,March 16, 2019 02:06 AM

గద్వాల టౌన్ : మెడికల్ షాపుల్లో కొన్న మందులకు రశీదులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా వినియోగదారుల సంఘం నాయకులు ఇన్‌చార్జి డీఎంహెచ్ వోను కోరారు. ప్రపంచ వినియోగదారుల దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా వినియోగదారుల ఫోరం నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేంద్ర కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. దవాఖానల్లో రోగికి చికిత్స పొందిన తరువాత డిస్‌చార్జి అయ్యేటప్పుడు తప్పకుండా రశీదును ఇవ్వాలని ఫోరం కోరింది. అలాగే మెడికల్ షాపుల్లో ఎంఆర్‌పీ పేరుతో దోపిడీ చేస్తున్నారని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారులకు ప్రతి వస్తువుపై అవగాహన కల్పించాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జయభారతి, వెంకటేశ్వర్లు, రామయ్య, క్రిష్ణయ్య, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles