లక్ష్యానికి మించి..

Fri,March 15, 2019 12:52 AM

-కందులు కొనుగోలు
-రైతన్నకు సర్కారు మద్దతు
-జిల్లాలో 3,577 మంది నుంచి 37,823 క్వింటాళ్లు కొనుగోలు
-సంతోషంలో అన్నదాతలు
గద్వాల,నమస్తేతెలంగాణ: ఈ ఏడాది జిల్లాలో హాకా ద్వారా లక్ష్యానికి మంచి కందులు కొనుగోలు చేయడంతో రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా లో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు 13,660 హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. రైతులు పండించిన కందులకు మద్దతు ధర ఇచ్చి వారికి చేయూత ని వ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కందు లు కోనుగోలు కేంద్రాలు చేర్పాటు చేసి రైతుల నుంచి కందులు కొనుగోలు చే యాలని నిర్ణయించింది. అందులో భా గంగా జిల్లాలో నాలుగు(గద్వాల, అ యిజ, ఇటిక్యాల, అలంపూర్) కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రభుత్వ మ ద్దతు ధర రూ.5,675కు రైతుల నుంచి కందుల కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలను జనవరి 19న ప్రారంభించి ఫిబ్రవరి 16వ తేదీ వరకు రైతుల నుం చి ప్రభుత్వ లక్ష్యమైనా 21వేల క్వింటాళ్లును హాకా ద్వారా కొనుగోలు చేశారు. అయితే రైతుల దగ్గర కందులు ఉండడంతో పాటు రైతులు మార్కెట్ కు కం దులు తీసుకొచ్చిన తరుణంలో మరో రెండు రోజుల పాటు రైతుల నుంచి గతనెలలో కందులు కొనుగోలు చేసి కేంద్రాలను మూసి వేశారు. .

గత నెల 25 నుంచి ఈ నెల 5 వరకు కొనుగోలు
రైతుల దగ్గర ఉన్న కందులు పూర్తి స్థా యిలో కొనుగోలు చేసే వరకు కొనుగో లు కేంద్రాలు తెరిచి ఉంచాలని రైతులు డిమాండ్ చేయడంతో ఈ విషయం కలెక్టర్ హాకా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈ విషయం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన మంత్రి రైతుల దగ్గర ఉన్న కం దులు కొనుగోలు చేసి వారికి చేయూత నివ్వాలని ఆదేశించడంతో అధికారులు తిరిగి గత నెల 25 నుంచి జిల్లాలో కం దులు కొనుగోలు చేయడానికి నిర్ణయించి రైతుల నుంచి కందుల కొనుగో లు చేశారు. గత ఏడాది వానాకాలంలో రైతుల నుంచి ప్రభుత్వం లక్షా33వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసింది. అయితే గతంలో కందుల కొనుగోలు లో అక్రమాలు జరిగాయని భావించి ఈ ఏడాది రైతులు సాగు చే సిన కంది పంట ఆధారంగా కొనుగోలును 21 వేల క్వింటాళ్లకు మాత్రమే పరిమితి చే శారు. అయినా రైతులు ఇబ్బందులు ప డకూడదనే ఉద్దేశ్యంతో మార్కెట్‌కు కా లపరిమితి లోపు తెచ్చిన కందులు అన్ని కొనుగోలు చేశారు. దీంతో మొత్తం ఈ నెల 5వ తేదీ నాటికి 3577 మంది రై తుల నుంచి 37,823 క్వింటా ళ్ల కందు ల కొనుగోలు చేశారు. అయితే మొదటి లక్ష్యం 21వేల క్వింటాళే అయినప్పటికి రైతుల దగ్గర కందులు ఇంకా ఉండడం తో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉం చుకుని గత నెల 25 నుం చి ఈ నెల 5వ తేదీ వరకు గద్వాల వ్యవసాయమార్కెట్‌తో పాటు, ఇటిక్యాల మండలంలో ని పుటాన్‌దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహాకారా సంఘం ద్వారా రెండో విడ త కందుల కొనుగోలు చేయడంతో రైతు లకు ఊరట లభించింది.

జిల్లాలో కందుల కొనుగోలు ఇలా..
జిల్లాలో నాలుగు కందుల కొనుగోలు కేంద్రాలలో రైతుల నుంచి కందులు కొ నుగోలు చేశారు. గద్వాల వ్యవసాయ మార్కెట్‌లో 1071మంది రైతుల నుం చి 11, 866.50 క్వింటాళ్లు, ఇటిక్యాల మండలంలోని పుటాన్‌దొడ్డి కందుల కొనుగోలు కేంద్రంలో 1055మంది రై తుల నుంచి 11,447.50క్వింటాళ్లు, అలంపూర్ వ్యవసాయ మార్కెట్ పరిధి లో 949మంది రైతుల నుంచి 9,087. 50 క్వింటాళ్లు, అయిజ వ్యవసాయమార్కెట్‌లో 502మంది రైతుల నుంచి 5,422 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అయితే రైతులకు మొ త్తం 37,823 క్వింటాళ్లకు సంబంధించి రూ.21,46,48,362 చెల్లించాల్సి ఉం డగా ఇప్పటి వరకు 75శాతం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిసిం ది. ఇంకా రైతులకు సుమారు రూ. 2,47,20,300 చెల్లించాల్సి ఉంది.

లక్ష్యాన్ని మించి కొనుగోలు చేశాం..
రైతులు పండించిన కందులకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలనే ఉద్ధేశంతో హాకా ద్వారా క్వింటాళ్లకు రూ.5,675 మద్దతు ధర చెల్లించింది. మొదట మాకు నాలుగు కొనుగోలు కేంద్రాల నుంచి 21వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే 21వేల క్వింటాళ్లు కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలను మూసి వేశాం. అయితే రైతుల దగ్గర ఇంకా కందులు మిగిలి పోయాయని తెలియడంతో గత నెల 25నుంచి రెండు కేంద్రాలలో కందులు కొనుగోలు చేశాం. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాలతో లక్ష్యానికి మించి కందులు కొనుగోలు చేశాం.
- పుష్పమ్మ,జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి .

72
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles