ఎండలో బయటకు వెళ్లొద్దు

Fri,March 15, 2019 12:51 AM

గద్వాల, నమస్తేతెలంగాణ: జిల్లాలో మా ర్చి మాసం నుంచే విపరీతమైనా ఎండవేడిమితో వాతావరణం వేడెక్కిపోయిందని దీని ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లరాదని కలెక్టర్ శశాం క ప్రజలకు సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మంది రంలో ఎండ తీవ్రతపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాస్థాయి అధికా రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద్భం గా ఆయన మాట్లాడుతూ రైతు కూలీలు, ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీలు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ సమయంలో ప్రజలు తమ శరీరానికి పడ నీరు తీసుకోవాలని సూచించారు. అవసరమైనా చోట చలివేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని గద్వాల, అయిజ పురపాలక సంఘ కమిషనర్లను ఆదేశించారు. పంచాయతీల్లో గ్రామ కార్య దర్శుల ద్వారా ఎండ జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. అవసరమైనా చోట హెల్త్ క్యాం పు లు ఏర్పాటు చేయాలని ప్రజలకు అవసరమైనా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించా రు. ఉపాధి కూలీలు 12 గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో కూలీ పనికి వెళ్ల కూడదన్నారు. కూలీలకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, వారికి అవసరమైనా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అం దుబాటులో ఉంచాలని డీఆర్‌డీవో అధికారి నాగలింగంచారిని ఆదేశించారు. జిల్లలో పశుసంపద ఎక్కువగా ఉందని ఎండ తీవ్రతతో ఒక్క పశువు చనిపోవడానికి వీలు లేదన్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించా రు. పశువుల డాక్టర్లు గ్రామాల్లోకి వెళ్లి ఈ సీజన్‌లో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహాన కల్పిం చాలన్నా రు. కలెక్టరేట్‌లో చలివేంద్రాన్ని ఏర్పాటు చే యాలని ప్రతి సోమవారం ప్ర జలు వస్తుంటారని వారి కోసం కార్యాలయ ఆవరణలో అంబలి కేంద్రం ప్రారంభించాలని ఏవోను ఆదేశించారు. ఎండల తీవ్రతకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై మీడియా ద్వారా ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు. జిల్లాలో మంచినీటికి ఎక్కడ కొరత రాకుండా మి షన్ భగీరథ అధికా రులు ప్రణాళిక రూపొందించుకుని అందరికి నీరు అందేలా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూ డాలని గ్రామీణనీటిసరఫరా ఈఈని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ఎండవేడిమి తగిలితే మూత్రంలో మంట రావడం, నోరు ఎండిపోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇవి కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలన్నారు. దీని నివారణ కోసం సరిపడా నీరు తాగడం, నీడలో కూ ర్చోవడం, ఒంటిపై తడిబట్టతో తూ డ్చడం ఓఆర్‌ఎస్ నీరు తాపడం అనంతరం దవఖానాకు తీసుకెళ్లాలని సూచించారు. లేనియ డల శరీరంలోని లవణాలు అన్ని బయటకు వెళ్లిపోయి స్పృహకోల్పోవడం, చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఎండకాలంలో ప్రజలు తమకు తా మే రక్షించుకునే ప్రయత్నం చేయాలన్నారు. సమావేశంలో సీపీవో వెంకటరమణ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles