పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Fri,March 15, 2019 12:51 AM

-ఆదాయం పెరుగుదలకు చర్యలుండాలి
-ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేయాలి
-గ్రామీణ ప్రాంతాల్లోనూ స్వచ్ఛత పాటించాలి
-జస్టిస్ సీ.వీ.రాముడు
-మాడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్‌పై ఆరా..!
-రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో కలిసి వీసీ
గద్వాల, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జస్టిస్ సీ.వీ.రాముడు అన్నారు. దీంతో పాటు పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాలు, పురపాలక సంఘాల్లో ఆదాయం పెంపొందించేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్లు స్థాపించడం ఎంతో ఉపయోగకరమని జస్టిస్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడి, పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి వాటిని డంపింగ్ యార్డులకు తీసుకెళ్లాలన్నారు. అందుకు అవసరమైన డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటిని ప్రాసెసింగ్ చేయాలన్నారు. రైతులకు ఎరువు గానూ ఇతర వస్తువుల తయారీకి ఉపయోగకరంగా వాడుకోచ్చని సూచించారు. ఇందుకు సెక్షన్-12ను అనుసరించాలని చెప్పారు. ప్రతి జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పేలా చర్యలకు ప్రతి పాదనలు పంపాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. అనంతరం మాడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ఏ విధంగా అమలవుతుందో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ నాయకుల పోస్టర్లు, ప్లెక్సీలు, గోడరాతల తొలగింపుపై ఆరా తీశారు. కొత్తగా ఏ పనులు ప్రారంభించ వద్దని, పాత పనులు కొనసాగించాల్సిందిగా సూచించారు. తెలంగాణ హరితహారంపై మాట్లాడుతూ ఒక గ్రామం ఒక నర్సరీ కింద ఎన్ని నర్సరీలు మొదలయ్యాయని, వచ్చే హరితహారానికి ఎన్ని మొక్కలు అందుబాటులలో రానున్నాయనే వివరాలు జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించిందన్నారు. దీని ద్వారా ఎంత మందికి జిల్లాలో లబ్ధి చేకూరుతుందని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఘన వ్యర్థ పదార్థాల నిర్వాణకు గద్వాల, అయిజ ప్రాంతాల్లో అటు మున్సిపాలిటీలో, ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా అనువైన స్థలం చూడటం జరిగిందన్నారు. త్వరలో డీపీఆర్ తయారు చేసి పంపుతామన్నారు. ఒక నర్సరీ ఒక గ్రామంలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 199 నర్సరీలకు 136 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 174 నర్సరీలలో 109 లక్షల మొక్కలు పెంచుతామన్నారు. అటవీ శాఖ ద్వారా 59 నర్సరీల నుంచి 56 లక్షల మొక్కలు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకోగా 55 నర్సరీల నుంచి 53 లక్షల మొక్కలు పెంచుతున్నామన్నారు. త్వరలోనే మిగిలిన లక్ష్యం పూర్తి చేస్తామని చెప్పారు. ఆసరా పింఛన్ విషయంలో ఓటరు జాబితా ద్వారా 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని గుర్తిస్తామన్నారు. సుమారు 9016 మందికి అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే నివేదిక ఇస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో రాములు, డీఆర్‌డీవో జ్యోతి, అటవీ శాఖాధికారి చంద్రశేఖర్, ఇన్‌చార్జి పురపాలక కమిషనర్ శ్రీనివాస్‌రావు, డీపీవో కార్యాలయ అధికారి విజయ పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles