ప్రజల రక్షణే మా కర్తవ్యం

Fri,March 15, 2019 12:51 AM

-చట్ట వ్యతిరేకులపై గ్రామస్తులు నిఘా పెట్టాలి
-నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
-ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ
-సరైన ధ్రువపత్రాలు లేని 12 బైకులు, 2 ఆటోలు స్వాధీనం
-కల్లు దుకాణంపై కేసు నమోదు
మానవపాడు : చరిత్రలో లిఖించబడిన బోరవెల్లి గ్రామానికి గణమైన చరిత్ర ఉంది. గ్రామానికి ఉన్న పేరును చెడగొట్ట కుండా సంస్థానానికి ఉన్న పేరును కాపాడాలి.. అందుకు ప్రజల రక్షణే మా కర్తవ్యం అని జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని బోరవెల్లి గ్రామంలో తెల్లవారు జామున 4.30 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్‌పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్ హుస్సేన్, సీఐ రాజు, ఐదుగురు ఎస్సైలు, 40 మంది పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటినీ తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన ధృవ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గ్రామంలో రామన్‌గౌడ్ ఇంటిని సోదా చేయగా కల్తీ కల్లు చేస్తున్నట్లు గుర్తించి, తయారీకి ఉపయోగించే ముడిసరుకు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గ్రామంలోని ఎనిమిది మంది రౌడీ షీటర్లను పిలిచి ఏఎస్పీ కృష్ణ కౌన్సెలింగ్ ఇచ్చారు.

అనంతరం ఏఎస్పీ గ్రామస్తులను ఉద్దేసించి మాట్లాడూతూ ఈ రోజు చేపట్టిన నాఖాబందీ కేవలం ప్రజల భాగోగుల కోసమేనని, ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని చెప్పారు. గతంలో గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. ఫ్యాక్షన్ పరిస్థితులు ఎక్కడా కనపడటం లేదన్నారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడు తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత పెడదారి పట్టకుండా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. వాటిని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పనులు చేసుకోవాలని, పెడదారి పట్టవద్దని సూచించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, మరి కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలు అలాగే ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. అన్ని పత్రాలూ ఉన్న వాహ నాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ విడిగా వాహన పత్రాలు ఉంచుకొని ప్రయాణిం చాలని, లైసెన్స్ తప్పక తీసుకోవాలన్నారు. ఎవరికైనా ఎలాంటి అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. మీకు ఏ అవసరమున్నా స్థానిక పోలీసు స్టేషన్లో గానీ, 100కు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. మీ గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, ఘనమైన చరిత్ర ఉందని, దాని పేరు చెడగొట్టవొద్దని సూచించారు. పట్టుబడిన వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపెడితే వాహనాలు తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles