భగభగ..

Thu,March 14, 2019 02:11 AM

- మండుతున్న ఎండలు
- జిల్లాలో గరిష్ఠంగా 39.7 డిగ్రీలు
- కనిష్ఠం 21.4 డిగ్రీలు
- 10 రోజుల్లో పెరిగిన ఎండలు
- జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన
- ఎండ తీవ్రతను సూచించే ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు


జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : మార్చి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. రోజు రోజూకు తన తీవ్రతను పెంచుతూ ఉష్ణతాపాన్ని రేకెత్తిస్తు న్నాడు. ఎండలు ముదురు తుండటంతో కలెక్టర్ శశాంక ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని పలు గోడ పత్రికలను విడుదల చేశారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు బస్టాండ్ రైల్వేస్టే షన్, నగర కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పా టు చే సేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టా రు. సా ధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న స మయంలో బయటికి రాకుండా ఉండాలని సూ చిస్తున్నారు. తప్పనిసరి పరి స్థితుల్లో బయట కు వస్తే పలు నిబంధలను పాటించాలని సూచి స్తు న్నారు. శరీ రానికి ఎక్కువ శక్తిని అందించే గ్లూ కో స్ వంటి పానియాలు సేకరించాలి. వడ దెబ్బత గిలితే వెంటే సమీప దవాఖానకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలి.

రోజు రోజూకు పెరుగుతన్న ఎండ
మార్చి నెల మొదటి వారం నుంచే ఎం డ తీవ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 4న గరిష్ట ఉష్టోగ్రత 37.7 డిగ్రీలు , కనిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీలుండగా గడిచిన 10 రోజుల్లో ఈ సంఖ్య 2 డిగ్రీలకు పైగా పెరిగింది. మార్చి 13 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీలుగా నమోదైంది. ఈ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే రానున్న ఏఫ్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది దా దాపుగా 46 డిగ్రీల వరకు జి ల్లాలో ఉ ష్ణోగత్రలు నమోదయ్యాయి. ఈ సారి కూ డా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కా వచ్చని వాతావ రణ శాఖ అధికా రులు అంచనా వేస్తున్నారు. పె రుగుతున్న ఉ ష్ణోగ్రతలను దృషిలో ఉం చుకొని పలు జా గ్ర త్తలు వహిస్తే వ డదెబ్బ తగల కుండా చూసుకోవచ్చు.

వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..
వేసవి కాలంలో ఆరుబయట పనిచేసే వాళ్లు ఎక్కువగా జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంటుంది. సూర్యరశ్మి నుంచి కాపాడు కోనేలా నీడలో పని చేస్తూ తరచూ నీటిని ఎక్కవగా తాగుతూ ఉండాలి. ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, వంటివి సేకరి స్తూ ఉండాలి. తెలుపు రంగు లేక లేత వర్ణ ములు కలిగిన కాటన్ దుస్తులను ధరించడం వలన వేడి తీవ్రత శరీరంపై ఎక్కవగా ఉండదు. బయటకు వెళ్లినప్పుడు తలకు వేడి తగలకుండా క్యాప్ లేక రుమాల చుట్టు కోవాలి. పలుచని మ జ్జిగా, గ్లూకోజ్ నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చె క్కరను ఒక గ్లాసు నీటిలో క లుపుకొని తాగాలి. ఇంటిలోనే త యారు చేసిన ఓఆర్‌ఎస్ ద్రా వణం తాగి నట్టయితే వడ దెబ్బ నుంచి సత్వర ఉపశమనం కలు గుతుంది. వడ దెబ్బ తగిలిన వారిని నీడలో, చల్ల ని ప్రదేశాల్లో ఉంచాలి. శరీరం ఉష్ణోగ్రతల పెరు గుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతకు తగ్గే వరకు తడిగుడ్డతో తుడుస్తూ ఉం డాలి. చంటి పిల్లలు, గర్బి ణు లు, చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వారు వడగా లులకు గురవకుం డా జాగ్రత్తలు తీ కోవా లి. వడదెబ్బ తగిలిన వెంటనే సాధారణ ప్రాథ మిక చికిత్స అందించాలి అప్పటికి సాధారణ స్థితికి రాకపోతే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి.

ఎండలో చేయకూడని పనులు
ఎండ తీవ్రత ఎక్కవగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం రోడ్లపైకి రావడంతో వడ దెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉన్నా యి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు బాగా ముదురు రంగు ఉన్న దుస్తులు ధరి ంచి వెళ్లకూడదు. కాఫీలు, టీలు అధి కం గా సేవించడం అంతగా మంచిది కాదు. అధిక వేడి వలన ఆహార పదార్థాలు తొం దరగా పాడవుతాయి. కాబట్టి ఎక్కువ సేపు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినకూడ దు. అలా తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎండలో పార్క్ చేయ బడిన కారులో చిన్న పిల్లలను, వృద్ధులను, ఆరోగ్యం బాగాలేని వారిని ఎక్కువగా సేపు ఉంచకూడదు.

ఎండ తీవ్రతను సూచించే రంగులు
ఎండ తీవ్రత ఎంత ఉందో సూచిం చేందుకు అధికారులు టీఎస్ డీపీఎస్ ద్వారా ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కలెక్టరేట్, రాజీవ్‌మార్గ్ ప్రదేశాల్లో ఈ బోర్డుల్లో అధికారులు ఎండ తీవ్రతలను బట్టి హెచ్చరికలు జారీ చేస్తు రంగులను సూచిస్తున్నారు. ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఈ బోర్డుల్లో 35 డిగ్రీల లోపు ఎండ ఉంటే నో వార్నింగ్ అంటూ ఆకుపచ్చ రంగును సూ చిస్తున్నారు. 35 నుంచి 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంటే వాచ్‌ని సూచిస్తూ పసుపు రంగును ప్రదర్శిస్తున్నారు. 41 నుంచి 45 డిగ్రీల వరకు ఎండ త్రీవత ఉంటే అలెర్ట్‌గా హెచ్చ రికలు జారీ చేస్తూ కాశాయం రంగును సూచి స్తున్నారు. 45 డిగ్రీల పైబడి ఎండ తీవ్రతలు ఉం టే వార్నింగ్ సూచిస్తూ ప్రమాద కరమంటూ ఎరుపు రంగును ప్రదర్శిస్తున్నారు. ఈ రంగులను బట్టి ఎండ తీవ్రతలను తెలసుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles