ఎన్నికల నిర్వహణలో రాజీ పడే ప్రసక్తేలేదు

Thu,March 14, 2019 02:09 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చట్ట పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు కలిగించే వారిని గుర్తించి వారందరిని బైండోవర్ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఎన్నికల అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరబాద్ నుంచి లా అండ్ అర్డర్, ఈవీఎంలపై అవగాహన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు విషయంలో ఎన్నికల అధికారులకు తగు సూచనలు చేశారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బైండోవర్ చేసిన వ్యక్తులను పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బైండోవర్ చేయాలని అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో మరికొందరిని గుర్తించిన వారిని సైతం బైండోవర్ చేయాలని ఆదేశించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపులో జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నివేదిక ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదల అయినందున ఎన్నికల నియమావళిని ఏ విధంగా పాటిస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన వారందరినీ బైండోవర్ చేయడం జరిగిందన్నారు. మోడల్‌కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా 12ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వారు షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు కలిపి 970బ్యాలెట్ యూనిట్లు,760కంట్రోల్ యూనిట్లు,820వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే పోలిటికల్ పార్టీల వారికి మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.సెక్టోరియల్ అధికారుల ద్వారా గ్రామాల్లో చునావ్ పాఠశాల నిర్వహించి వీవీ ప్యాట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి నియోజక వర్గానికి 12 రూట్ల వారీగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ వీడీయో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి పాల్గొనగా జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఎస్పీ లక్ష్మీనాయక్, జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles