రూ. వందకే..!

Tue,February 19, 2019 01:10 AM

-పురపాలికల్లో ఇంటింటికీ నల్లా
-సీఎం కేసీఆర్ ఆదేశాలు
-జిల్లాలో 10,619 కుటుంబాలకు లబ్ధి
-ఇక ఇంటింటికీ శుద్ధజలం
-త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
గద్వాల, నమస్తే తెలంగాణ : ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అం దించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా ప ట్టణాల్లో ఉండే ప్రతి కుటుంబానికి రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వడమే ల క్ష్యంగా ముందుకు సాగుతుంది. గతం లో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నల్లా కనెక్షన్ పొందాలంటే ఎక్కువ మొత్తం లో రూ.6,000 డిపాజిట్ తీసుకునేవా రు. అదే ఇంటిలోపల నల్లా ఏర్పాటు చేసుకోవాలంటే రూ.10,500 డిపాజి ట్ తీసుకునేవారు. దీంతో పట్టణ ప్రాం తాల్లోని ప్రజలు నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది. చాలా మంది ఇంటి నిర్మాణాలు చేపట్టినా.. నల్లా కనెక్షన్ తీసుకోలేదు. ఈ విషయా న్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం శుద్ధమైన మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు చెల్లించే డిపాజిట్లను భారీగా తగ్గించిం ది.

పురపాలక సంఘాల పరిధిలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో సుమారు 10,619 కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. జిల్లాలోని గద్వాల పురపాలక సంఘంలో 11,734 కు టుంబాలు ఉండగా.. అందులో నల్లా క నెక్షన్లు ఉన్న వారు 6,450కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అంటే సు మారు 5,284 కుటుంబాలు నల్లా కనెక్షన్లు తీసుకోలేదు. అలాగే అయిజ పురపాలక సంఘంలో 6,794 కుటుంబాలకు గా నూ 1,459 కుటుంబాలకు మా త్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 5,335 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవు. దీంతో వీరంతా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గ తంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి రూ.1కే నల్లా కనెక్షన్ ఇవ్వడంతో బీపీఎల్ కుటుంబాలకు ఎంతో మేలు చేకూరింది. కాగా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న తాజా నిర్ణయంతో దారిద్య్రరేఖ ఎగువన ఉన్న కుటుంబాలకు కూడా రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృ ష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతాల్లో రూ.100కే నల్లా కనెక్షన్ ఇస్తుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని కుటుంబాలు నల్లా కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడింది. త్వరలో ఈ కనెక్షన్‌కు సంబంధించి విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఏదేమైనా మిషన్ భగీరథ పథకం ద్వా రా పేద ప్రజల ఇంటింటికీ మంచినీరు చేరబోతుంది. దీని కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles