నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయం

Tue,February 19, 2019 01:08 AM

-విభేదాలు వీడి కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం
-ఎమ్మెల్యే అబ్రహం
-రూ.55.60 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ
మానవపాడు : అక్షరమాలలో ముం దున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం అలంపూర్ నియోజక వర్గం వెనుకబడి ఉండేదని అలంపూరు ఎమ్మెల్యే డా. వీఎం అబ్రహం అన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చి సీఎంగా రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అలంపూర్ నియోజక వర్గం రూపు రేఖలు మారనున్నాయని ఎమ్యెల్యే అబ్రహం అన్నారు. వెనుకబడిన అలంపూర్ నియోజక వర్గాన్ని గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. కానీ నియోజక అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వారి చలువతో ని యోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్యెల్యే అబ్రహం అన్నారు. సోమవారం మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో ఎమ్యెల్యే అబ్రహం బీటీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే అబ్రహం మండల కేంద్రమైన మానవపాడులో మాట్లాడుతూ మండలాలకు కనెక్టివిటీ కలిపించుటకు వెనుకబడిన అలంపూర్ నియోజక అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.55.60 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో మెరుగైన రవాణా సదుపా యం కల్పించుటకు ప్రభుత్వం పూ నుకుం దన్నారు. గోకులపాడు ఎలాంటి చిన్నపాటి గ్రామాలకు సైతం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు.

గతంలోనే ఈ రోడ్ల పనులకు శంకుస్తాపన చేయాల్సిందన్నారు. ఎన్నికల నియమావలి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. గ్రామాలలో విభేదాలు విడనాడాలన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా మీ వెంట ఉంటానన్నారు. అంతకు ముం దు ఉదయం రూ.90 లక్షలతో బొం కూరు నుంచి మెన్నిపాడు వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. రూ.1.35 కోట్లతో కలుగొట్ల నుంచి రాయచూరు రోడ్డు వరకు, రూ. 1.6 కోట్లతో మానవపాడు నుంచి వ యా గోకులపాడు మీదుగా చంద్రశేకర్ నగర్ వరకు, రూ.1.50 కోట్లతో ఇటిక్యాలపాడు మీదుగా తక్కశిల వరకు, రూ.1.78 కోట్లతో జాతీయ రహదారి 44 నుంచి ఆర్డీఎస్ కాలువపై నుంచి ఉండవెల్లి వరకు, మానవపాడు క్రాస్‌రోడ్డు నుంచి బోరవెల్లి వరకు బీటీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేదవతి వరన్నగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు హేమవతి, సుజాత ఎంపీటీసీ రజితా మురళీధర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్‌రెడ్డి, రాజశేఖర్ రావు, ఆత్మలింగారెడ్డి, రోషన్న, లోకేశ్వర్ రెడ్డి, బోరవెల్లి సత్యారెడ్డి, మురళీధర్ రెడ్డి, వెంకట్రాముడు, రాఘవరెడ్డి, మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles