ప్రజల కోసం ప్రజావాణి : ఏఎస్పీ

Tue,February 19, 2019 01:07 AM

గద్వాల క్రైం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు న్యాయం చేసేందుకే నిర్వహిస్తోందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కటుకూరి కృష్ణ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘటనలకు సంబంధించిన కేసుల్లో తమకు న్యాయం జరగలేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులతో ఏఎస్పీ నేరుగా మాట్లాడారు. సమస్యలను విన్న ఆయన విచారించి, చట్టబద్దమైన వాటికి తప్పకుండా పరిష్కారం చూపుతా మన్నారు. ఎలాంటి భయం లేకుండా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించి, వారిలో ధైర్యం నింపేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు. పోలీసు అన్న భయం వీడాలన్నారు. సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయినా ప్రశాంతమైన వాతావరణంలో సంబంధిత పోలీసు స్టేషన్‌లలో తీసుకోడానికి తమ సిబ్బంది ఉంటారన్నారు. సామాన్య ప్రజలకు చట్టబద్దంగా న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ఉందన్నారు. అయితే సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ తగదాలు, భూమి వివాదాలు, ప్లాట్ అక్రమ రిజిస్ట్రేషన్ తదితర ఫిర్యాదులను ఆయన ఏఎస్పీ పరిశీలించి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ, ఆయా పోలీసు స్టేషన్‌ల ఎస్సైలను ఆదేశించారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles