నట్టింటికీ భగీరథ జలం

Mon,February 18, 2019 01:11 AM

-పనులన్నీ పూర్తిచేసుకున్నమిషన్ భగీరథ
-దౌదర్‌పల్లిలో నల్లాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-జిల్లాలో రెండు నీటిశుద్ధికేంద్రాలు
-మిషన్ భగీరథకురూ.512.24 కోట్లు ఖర్చు
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : మిషన్‌భగీరథ పథకం కల నెరవేరింది. జిల్లాలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ రక్షిత మంచి నీరందుతుం ది. జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లిలో ఇటీవల స్థానిక ఎమ్మెల్మే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలనీ ప్రజలకు మంచినీటి అందించారు. తె లంగాణ ఆడబిడ్డలు మంచి నీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్లపై వచ్చే అవసరం లేకుండా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారీ అంచ నాలతో ప్రారంభించిన ఈ పథకం అనేక అవాంతరాలను దాటుకుంటూ యుద్ధ ప్రాతిపాదిక పనులు పూర్తి చేసుకొని గమ్యాన్ని చేరుకుంది. ఈ శుద్ధీ చేసిన మంచి నీటిని ప్రజలకు అందించడం ద్వారా చాలా వరకు ప్రజ లు ఎదుర్కొంటున్న వ్యాధుల భారీ నుంచి తప్పించుకోవచ్చు. తాగునీటి ఎ న్నో ఏళ్లుగా ఎదురు చూ స్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలకు మిషన్ భగీరథ నీటినితో మోక్షం లభించింది.

జిల్లాలో రెండు నీటి శుద్ధికేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతా ల్లో వ్యక్తి రోజూకు 135 లీటర్లు, గ్రామీ ణ ప్రాంతాల్లోని వ్యక్తి రోజూకు 100 లీటర్ల రక్షిత మంచినీటిని అందించేందు కు మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం ప్రతి జి ల్లాలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది వరకే జిల్లాలో రక్షిత మం చి నీటి పథకం ద్వారా రెండు నీటి శుద్ధి కేంద్రాలున్నాయని ధరూర్ మండలం జూరాల ప్రాజెక్ట్ దగ్గర 21ఎంఎల్‌డీ కెపాసీటీ గల నీటి శుద్ధి కేంద్రం, రాజోళి మండలం సుంకేశుల దగ్గర 10.5 కెపాసీటీ గల నీటి శుద్ధి కేంద్రాలున్నాయి. అ యితే జిల్లాలోని 319 గ్రామాలకు, రెండు మున్సిపాలిటీల ప్రజలకు తాగునీటిని అందించడానికి ఈ శుద్ధి కేంద్రా లు సరిపోకపోవడంతో జూరాల దగ్గర అదనంగా 70ఎంఎల్‌డీ కెపాసీటీ గల నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ద్వారా జిల్లాలో ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందుతున్నాయి.

మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి
జిల్లాలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం జూరా ల దగ్గర చేపట్టిన 70ఎంఎల్‌డి కెపాసీటీ గల శుద్ధీకేంద్రం పనులన్నింటిని పూర్తి చేసుకొని శుద్ధిచేసిన మంచి నీటిని అం దింస్తోంది. జూరాల ప్రాజెక్ట్ అంతర్భాగంగా ఉన్న 130హెచ్‌ఎస్‌ఆర్ గల రెం డు సంపులు, 5 జీఎల్‌బీఆర్ గల రెండు పంప్‌హౌజ్‌లు నిర్మాణాలు కూడా పూర్తవ్వడంతో వీటిలోకి శుద్ధీచేసిన నీటిని నింపుతున్నారు. నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన 849.7 కీ.మీ పైపులైన్లు, 465 కీ.మీ పైప్‌లైన్ పనులు కూడా పూ ర్తయ్యాయి. ప్రతి గ్రామానికి , మున్సిపాలిటీలకు బల్క్ సైఫ్ల్లె రోజువారి సరఫ రా చేయడం కోసం ఇప్పటి వర కు రూ. 420.78 కోట్లను ఖర్చు చేశారు. వీటి పాటు ఈ పథకంలో భాగ మైన ఇం ట్రా పనుల్లో 336 ఉపరితల బాంఢాగారాలు (ఓహెచ్‌ఎస్‌ఆర్) పనుల్లో ఇ ప్పటి వరకు 306 పూర్తిచేశారు. 1, 30,139 నల్లా కనెక్షన్ల లక్ష్యాన్ని కూ డా చేరుకున్నారు. నల్లా కనెక్షలన్లు ఇచ్చేందుకు 1150.966 కీ.మీ పైప్‌లై న్ నిర్మాణ లక్ష్యాన్ని కూడా చేరుకున్నా రు. ఈ నల్లా కనెక్షన్ల కోసం ఇప్పటి వర కు రూ.91.46 కోట్లు ఖర్చు చేశారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles