అభివృద్ధి ప్రదాతకు అమ్మ ఆశీర్వదాలు

Mon,February 18, 2019 01:08 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్‌కు నాలు గున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభిమానంతో పాటు శక్తి మాత అమ్మ అలంపూర్ జోగుళాంబ ఆశీర్వాదాలు కూడా కేసీఆర్‌కు మెండుగా ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం కేసీఆర్ జన్మదినా న్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాం ప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం పా ర్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొ క్కలు నాటారు. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అమ్మ కేసీఆర్‌కు ఆయూరారోగ్యాలను ప్రసాదించాలని ప్రజలు కో రుకుంటున్నారన్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి అన్నిరాష్ర్టాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు. కేసీఆర్ 65వ జన్మది నం సందర్భంగా క్యాంప్ కార్యాలయం ఆవరణలో మొ క్కలు నాటారు.

బంగారు తెలంగాణ సాధన దిశగా ..
ఓటమి ఎరుగని నాయకుడు కేసీఆర్ అడుగు జాడల్లో మనం అడుగులు వేస్తు బంగారు తెలంగాణ సాధన దిశగా మన మందరం కృషిచేద్దామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. సీఎం కేసీఆర్ జన్మ దినం సందర్భంగా ఆదివారం అలంపూ ర్ పట్టణంలో ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి మాట్లాడారు. అపర భగీరథుడు కేసీఆర్ అనుకున్న ఏ పని అయిన సాధించేంత వరకు విడిచిపెట్టడన్నారు. కేసీఆర్ కిట్టు తో మాత శిశువుల మరణాలు తగ్గించారన్నారు. తల్లిబిడ్డల ఆరోగ్యం కో సం 102 సేవలు ప్ర వేశ పెట్టారన్నారు. అనంతరం దవాఖానా ఆవరణ లో మొక్కలు నాటా రు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో మల్లిఖార్జున్, టీఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, పల్లెపాడు శంకర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, సుదర్శన్‌గౌడ్, జయరాముడు, రాజశేఖర్‌రెడ్డి, కిశోర్, మోహన్‌రెడ్డి, గంగిరెడ్డి, అల్లాబకాష్, ఫయాజ్, పుల్లూరు బాబు, శ్రీ కా ంత్, మహేష్‌గౌడ్, లక్ష్మన్న ,ఇస్మాయిల్, బొంకూరు శ్రీనివాసరెడ్డి, సత్యారెడ్డి, వరన్‌గౌడ్, నర్సన్‌గౌడ్, వల్లూరు శ్రీనివాసరెడ్డి, గుందిమల్ల పెద్దారెడ్డి, ధనుంజయ, అయ్యస్వామి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles