గద్వాల కోట శోబితం నయనా నందం

Mon,February 18, 2019 01:07 AM

-వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-విశేష అలంకరణలో స్వామి వారి దర్శనం
-హనుమద్ వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
-విద్యుద్దీపాల వెలుగులో గద్వాల కోట
గద్వాలటౌన్ : మంత్రాలయ పీఠాధిపతి 1008 శ్రీశ్రీ సుబుధేంద్ర తీర్థుల శ్రీపాదులవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ భూలక్షీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనం గా నిర్వహిస్తా రు. ఉత్సవాల్లో భాగంగా మొద టి రోజు ఉదయం 8 గంటలకు మూల విరాట్‌కు నిత్య విశేష ఫల పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. అలాగే సా యంకాలం పు ణ్యహవచనం, దేవతా ఆ హ్వానం, దీక్ష వస్త్రం, కలశ స్థాపనం, గో పూజ కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వా మివారిని హనుమద్ వాహనంపై ఆల య ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం మహా మంగళహారతి చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్య లో భక్తులు హాజరయ్యారు.
రామాలయంలో..
కోటలోని శ్రీరామలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట పూజా కార్యక్రమాలు అ త్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5గంటల నుంచి పూజలు పం డితులు ప్రారంభించారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యావాచనం, మృత్తి కా సంగ్రహణం, అంకురార్పణం, యాగశా ల ప్రవేశం, షోడశస్తంభపూజ, రుత్విగ్వరణం, కలశస్థాపనం, మూలమంత్ర జపములు, దేవతాహ్వానము, జలాదివాసం, ధాన్యధివాసం మొదల గు పూజలు నిర్వహించారు. ప్రదోశపూజ, మహామంగళహారతి, స్వస్తి శయ్యాధివాసం తదితర పూజలు నిర్వహించారు. అలాగే పండితులు వాదిరాజ్ ఆచారి, కనకచల ఆచా రి, రాఘవేంద్రచారి, వెంకటేశాచారి, శ్రీనివాసచారిలు పవమానహోమం, సుదర్శనహోమం, మనిసుక్తహోమం తదితర హోమాలు
నేడు కల్యాణోత్సవం..
స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగం గా సోమవారం సాయంత్రం కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ విచారణ కర్త ప్రభాకర్ తెలిపారు. అలాగే స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి గ ద్వాల ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అ తిథిగా హాజరవుతారన్నారు. భక్తులు అధి క సంఖ్యలో కల్యాణోత్సవానికి హాజరై స్వామివారి కృపకు పాత్రు లు కాగలరని ఆయన కోరారు.
నేడు విగ్రహాల ప్రతిష్ట..
శ్రీరామాలయంలో సోమవారం సీతారాములులక్ష్మణుల, భూదేవి విగ్రహాల ప్రతి ష్ట, ధ్వజారోహణం ఉంటుంది. అలాగే నేత్రోన్మీలనం,యంత్ర ప్రతిష్ట, మూర్తి ప్ర తిష్ట ప్రాణప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, జ్వాలా దర్శనం, గో దర్శనం, బలిదానం, పూర్ణాహుతి పూజలు ఉంటాయి. అలాగే సంస్థాన పూజ, పీఠాధిపతి ఆశీర్వచనాలు ఉంటాయి. ఈకార్యక్రమాలకు రా జవంశీయులు లతాభూపాల్, కేశవభూపాల్, కృష్ణరామభూపాల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles