అవయవ దానం మరొకరికి పునర్జన్మనిస్తుంది

Mon,February 18, 2019 01:07 AM

గద్వాల న్యూటౌన్: మరణానంతరం అవయవాలను దానం చేయడంతో మరొకరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన గద్వాలలోని టీఎన్‌జీవో భవనంలో ఆదివారం సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ మానవుని ప్రాణ విలువ మరణానంతరమే తెలు స్తుందన్నారు. తమ మరణానంతరం తమ అవయవాలను (గుండె, కళ్లు మొదలైనవి) ఇతరులకు దానం చేసినప్పుడే వారిగొప్పతనం సమాజానికి తెలుస్తుందన్నారు. అవయ వదాన విషయంలో అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రారంభించిన అవయవదాన సంకల్ప కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. గొప్ప మనస్సుతో తమ మరణానంతరం అవయవ దానం చేస్తామని 111మంది దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వారికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాధిక, తెలంగాణ జాగృతి నాయకులు హనీఫ్, విశాల్, రవి, భరత్‌రెడ్డి, రహిమ్, ఉమా దేవి, మంగారాణి, సుజాత, రంజాభీ, ఉమారాణి, శైలజ, విజయ్, ప్రశాంత్ తదిత రులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles