భక్తుల కొంగు బంగారం..

Sun,February 17, 2019 01:38 AM

-స్వయంభూ గుంటి రంగనాథుడు
-భక్తుల ఇలవేల్పుగా ఆలయ క్షేత్రం
-రేపటి నుంచి గుంటి రంగనాథుడి బ్రహ్మోత్సవాలు
-18న కల్యాణం, ప్రభోత్సవం, 19న రథోత్సవం
-20న అంతర్ రాష్ట్ర ఓపెన్ కబడ్డీ పోటీలు
-22న రైతు సంబురాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
అయిజ : మండలంలోని రాజాపురం గ్రామంలో వెలసిన స్వయంభూ గుంటి రంగనాథుడు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ.. కొంగు బంగారంగా విరా జిల్లుతున్నాడు. శ్రీదేవి, భూదేవి సమేత వెలసిన గుంటి రంగనాథ స్వామి ఆల య క్షేత్రం భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచింది. ప్రతి ఏటా మాఘశుద్ధ చతుర్దశి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వరకు రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించే బ్ర హ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాజాపురంలో గట్టుపైన పెద్ద బండరాళ్ల మధ్యలో గుంటి రంగనాథుడు దశాబ్దాల కిందట స్వయంభూగా వెలిశాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. సమీప గ్రామాలైన పులికల్, బైనపల్లి, కొత్తపల్లి, కిసాన్‌నగర్, మేడి కొండ, సింధనూరు గ్రామాలకు చెందిన భక్తులతోపాటు కర్నాటక, ఆంధ్ర రాష్ర్టా లకు చెందిన భక్తులు తమ ఇంటి దైవంగా కొలుస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ముఖ ద్వారం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే తినుబండారాలు, పిల్లల ఆటవస్తువులు, వివిధ రకాల దుకాణాలు వెల శాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ అన్ని రకాల చర్యలు చేపట్టింది.

బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు..
రాజాపురం గ్రామంలోని గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం తుంగభద్ర నది జలాలతో మూలవిరాట్‌కు అభిషేకం, పుష్పాభిషేకం, అర్చనలు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమే త గుంటి రంగనాథుడి కల్యాణం, రాత్రి 7 గంటలకు పల్లకీసేవ, రాత్రి 10.30 గంటలకు ప్రభోత్సవం, మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉద యం స్వామి వారికి నిత్యపూజలు, రాత్రి 7 గంటలకు పల్లకిసేవ, రాత్రి 12.30 గంటలకు రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

20న అంతర్ రాష్ట్ర ఓపెన్ కబడ్డీ పోటీలు..
గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 20 నుంచి అంతర్ రాష్ట్ర ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ పేర్కొంది. కబడ్డీ పోటీల్లో పాల్గొనే జట్లు రూ.500 ఎంట్రీఫీజు చెల్లించి వివరాలను నమోదు చేయించుకో వాలని దేవస్థాన కమిటీ తెలిపింది. పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బ హుమతి రూ.20వేలు (జడ్పీటీసీ చంద్రావతి హనుమంతు), రెండో బహుమతి రూ.15వేలు (పీఏసీఎస్ అధ్యక్షుడు సంకాపురం రాముడు), మూడో బహుమతి రూ.10 వేలు (మేడి కొండ సర్పంచ్ తిప్పారెడ్డి), నాలుగో బహుమతి రూ.5 వేలు (పులికల్ సర్పంచ్ గోవర్దనమ్మ)లు అం దజేయనున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. రాతి 9 గంటలకు గుంటి రంగనాథస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

22న రైతు సంబురాలు ..
గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న రైతు సంబు రాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. రైతు సంబురాల్లో భాగంగా న్యూ కేటగిరి అంతర్ రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తామని పేర్కొంది. పోటీలలో గెలుపొందిన వృషభరాజములకు మొదటి బహుమతి రూ. 30 వేలు (మేడికొండ చిన్న ఈశ్వర్), రెండో బహుమతి రూ. 25 వేలు (సింగిల్ విండో డైరెక్టర్ హనుమన్న), మూడో బహుమతి రూ. 20వేలు (బైనపల్లి సర్పంచ్ సరస్వతి), నాలుగో బహుమతి రూ. 15వేలు (గుంటి రంగనాథస్వామి దేవస్థాన కమిటీ), ఐదో బహుమతి రూ. 10వేలు (పులికల్ సర్పంచ్ గోవర్దనమ్మ కిశోర్), ఆరో బహుమతి రూ. 5వేలు (గుంటి రంగనాథస్వామి దేవస్థాన కమిటీ) అందించనున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles