పల్లె రహదారులకు మహర్దశ

Thu,February 14, 2019 12:39 AM

-రూ.13.09 కోట్లతో బీటీ రహదారులు
-నేడు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే అబ్రహం
అయిజ : రాష్ట్రంలో పల్లె రహదారులకు మహర్దశ పట్టనుంది. మండలంలో పంచాయతీరాజ్, ఎస్‌డీఎఫ్ గ్రాంట్ కింద మండలానికి రూ. 13.09 కోట్ల బీటీ పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మండలంలో ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి బింగిదొడ్డి గ్రామం వరకు ఒక కిలోమీటర్ రూ. 67 లక్షలు, ఉత్తనూరు నుంచి తుపత్రాల వరకు 2.66 కిలోమీటర్లు రూ.1.25 కోట్లు, ఆర్‌అండ్‌బీ గుడుదొడ్డి నుంచి యాపదిన్నె వరకు 3 కిలోమీటర్లు రూ. 1.50 కోట్లు, చిన్నతాండ్రపాడు ఆర్డీఎస్ కెనాల్ నుంచి నౌరోజీక్యాంపు వరకు 4.4 కిలోమీటర్లు రూ. 2.10 కోట్లు, రాయచూర్ రహదారి ఆర్‌అడ్‌బీ రహదారి నుంచి సంకాపురం మీదుగా ఈడిగోనిపల్లి వరకు 3.3 కిలోమీటర్లు రూ.1.80 కోట్లు, రాజాపూర్ నుంచి బైనపల్లి మీదుగా కొత్తపల్లి వరకు 5 కిలోమీటర్లు రూ. 2.50 కోట్లు, ఎక్లాస్‌పూర్ రహదారి నుంచి దేవబండ వరకు బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ. 2.8 కిలోమీటర్లు 1.44 కోట్లు, రాజాపూర్ నుంచి కుటుకనూర్ మీదుగా ఒక కిలోమీటర్ రూ. 15 లక్షలు, పర్దిపురం నుంచి జడదొడ్డి రూ. 1.60కోట్లు నిధులు విడుదల చేస్తూ బీటీ రహదారులకు అనుమతులు జారీ చేసినట్లు పంచాయతీ రాజ్ ఏఈఈ లక్ష్మన్న తెలిపారు.
నేడు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే
మండలానికి మంజూరైన బీటీ రహదారుల నిర్మాణాలకు అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం గురువారం శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు ఎంపీపీ సుందర్‌రాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు రాముడు తెలిపారు. బీటీ రహదారులతోపాటు కస్తూర్బా పాఠశాలలో కళాశాల నిర్మాణం, తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే మండలంలో పర్యటిస్తారని ఎంపీపీ పేర్కొన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles