ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి..

Tue,February 12, 2019 12:10 AM

గద్వాల క్రైం : సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజావాణిని కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కటుకూరి కృష్ణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన గద్వాలలోని ప్రధాన పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజావాణిలో జిల్లాలోని పలువురు బాధితులు వివిధ కేసుల్లో ఉన్న పరిష్కారం కానీ సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను విన్న ఏఎస్పీ సమస్యలను తప్పకుండా విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు. చట్టబద్దమైన వాటికి న్యాయం చేస్తామన్నారు. సమస్య ఏదైనానేరుగా పోలీసు స్టేషన్‌లో చెబుకోవచ్చన్నారు. ప్రజల రక్షణకై తమ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అనంతరం బాధితుల ద్వారా వచ్చిన భూతగదాలు, కుటుంబ గొడవలు, ఇతర అంశాలకు సంబంధించిన 9 ఫిర్యాదులను పరిశీలించిన ఏఎస్పీ వాటిని విచారణ చేసి పరిష్కరించాల్సిందిగా డీఎస్పీ, సీఐ,సంబంధిత పోలీసుస్టేషన్ల ఎస్సైలను ఆదేశించారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles