పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవచ్చు

Tue,February 12, 2019 12:09 AM

గద్వాల న్యూటౌన్ : ఏకాగ్రత...పక్కా ప్రణాళికతో చదవితేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఇన్‌చార్జి డీఈవో సుశీంద్రరావు పే ర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్త మ ఫలితాలే లక్ష్యంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం తొలగించేందుకు గద్వాలలోని బృందావన్ గార్డె న్, బాలభవన్‌లోలో సోమవారం ఏ ర్పాటు చేసిన ప్రత్యేక ప్రేరణ తరగతులకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యంపై గురిపెట్టామంటే ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించకుండా దాన్ని చేరుకోవాలన్నారు. కష్టపడి చదివిపిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి విద్యార్థి త ప్పకుండా సాధన చేయాల్సిందేనన్నారు. దీనికి గొప్ప సంకల్పంతో పాటు కసి, కృ షి, పట్టుదల, పోటీతత్వం తప్పక ఉండాలన్నారు. లక్ష్యం చేరుకునే మార్గంలో ఆ టంకాలొ స్తున్నాయని ఆందోళనచెందాల్సిన అవసరం లేదన్నారు. వాటిని ధైర్యం ఎదుర్కొని తమ పనిని విజయంతంగా పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. పరీక్షల సమయంలో ఏవైనా చిన్నపాటి సమస్యలు, ఇబ్బందు లు వచ్చినా వాటిని తేలిగ్గా తీసుకోవాలన్నారు. ఆత్మ విశ్వాసం..ఆత్మ ైస్థెర్యంతో ప రీక్షలు రాయాలన్నారు. ప్రతికూలా వాతావరణాన్ని మనసులోంచి తొలగించా ల న్నారు. కష్టపడితే విజయం మనదేనన్నా రు.

తప్పకుండా తల్లిదండ్రుల, సం బంధి త సబ్జెక్టు ఉపాధ్యాయుల సలహాలు, సూచనలను పాటించాలన్నారు. ఏ సబ్జెక్టును కూడా తేలికగా తీసుకోరాదన్నారు. అన్నింటికి స మయం కేటాయించి విషయాన్ని పూ ర్తిగా అవగాహన చేసుకోవాలన్నా రు. పరీక్ష సమయంలో టీవీలు, సెల్ ఫోన్‌లపై దృష్టిపెట్టరాదన్నారు. తల్లిదండ్రు లు కూడా తమ పిల్లలపై చిన్న చిన్న విషయాలపై కోపాన్ని ప్రదర్శించడం.. ..పనులను అప్పగించడం లాంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి వరసలో నిలబెట్టేందుకు ఉపాధ్యాయు లు కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండ గా పలు సబ్జెక్టులపై ఇన్‌చార్జి డీఈవో వి ద్యార్థులకు ప్రశ్నలు వేసి వారిని సమాధానాలు రాబట్టి వారిలోని ప్రతిభను తె లుసుకున్నారు. అంతకు ముందు ఆ యా సబ్జెక్టుల ఉపా ధ్యాయులు పదో త రగతి పరీక్షల ప్రశ్నాపత్రం ఎలా ఉం టుందో ఎక్కువ మార్కులు ఎలా సా ధించాలో మొదలైన అంశాలపై విద్యార్థులకు మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రతాప్‌రెడ్డి, జీహెచ్‌ఎలు పరమేశ్వరరెడ్డి, హనుమంతు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విష్ణు, కృష్ణ, భాస్కర్ పాపన్న, జైపాల్‌రెడ్డి, సౌ మ్యాదేవి, సుమలతలు పాల్గొన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles