టీఆర్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయండి

Tue,January 22, 2019 01:37 AM

-టీఆర్ నాయకులు బండ్ల జ్యోతి, వెంకట్రాములు
మల్దకల్ : మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులను గెలిపించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని బూరెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి, టీఆర్ సీనియర్ నాయకుడు నాగర్ వెంకట్రాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు నీలిపల్లి, నాగర్ గార్లపాడు గ్రామాల్లో వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో, నియోజక వర్గంలో టీఆర్ పార్టీ అధికారంలో ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ స్థాయిలోనూ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజలు ఆలోచించి టీఆర్ బలపర్చిన సర్పంచు అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాలకు చెందిన పార్టీ సర్పంచు అభ్యర్థులు, వార్డు మెంబర్లు, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, పార్టీ అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ వెంకటన్న, నాయకులు ప్రభాకర్ నరేందర్, పల్లయ్య, దివాకర్ నర్సింహారెడ్డి, నారాయణ, జనార్ధన్ గోవిందు, మధు, కిష్టన్న, తిమ్మరాజు, ప్రభాకర్, శేఖర్, సవారప్ప పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles