ప్రతి ఒక్కరూ ఓటుహక్కును పొందాలి

Sat,January 19, 2019 01:18 AM

అయిజ : పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి, అలంపూ ర్ నియోజకవర్గ నోడల్ అధికారి (స్వీప్) గోవిందనాయక్ సూచించారు. శుక్రవారం అయిజ పట్టణంలోని హమాలీ కా ర్మికులతో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ దేశాల మేరకు కలెక్టర్ శశాంక సూచనలతో అలంపూర్ నియోజకవర్గంలోని మూడు పురపాలికలో ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి పేర్కొన్నారు. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ పట్టణాలలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో ఓటుహక్కు లేనటువంటి వా రు ఈ నెల 25వ తేదీలోగా ఫారం- 6 లో పూర్తి వివరాలను పూరించి బీఎల్ ఆన్ నమో దు చేయించుకోవాలన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన వారు విధిగా ఓటుహక్కు ను పొందాలన్నారు. గతంలో ఓటరు లిస్టు లో పేర్లు ఉండి గత ఎన్నికల్లో ఓటరు లిస్టులో పేరు కనిపించక పోవడంతో ఓటుహక్కును పొందలేకపోయారని, ప్ర స్తుతం వారు అందరు ఓ టుహక్కు కోసం దరఖాస్తులను విధిగా చేసుకోవాలని సూ చించారు. మూడు పట్టణాలలోని కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలను విసృతం చేసి వంద శాతం అర్హులకు ఓటుహక్కు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles