యువతీ, యువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

Thu,September 13, 2018 01:05 AM

-జేసీ నిరంజన్
గద్వాల, నమస్తే తెలంగాణ : 2018 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి యువతీ యువకులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు తప్పక చేయించుకోవాలని జేసీ నిరంజన్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సవరించిన ఎన్నికల షెడ్యూల్ విధి విధానాలపై గుర్తింపు పొందిన జిల్లాలోని వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇంతకు ముందు షెడ్యూలు ప్రకారం 1-1-2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటర్ జాబితాలో చోటు కల్పించబడేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికల నిర్వాహణ కోసం ఎన్నికల సంఘం 1-1-2019 తేదీ కాకుండా 1-1-2018వ తేదీని ప్రామాణికంగా తీసుకొని ఆ రోజుకు 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా పేర్కొనడం జరిగిందని చెప్పారు.

అదే విధంగా 10-09-2018 నాటికి తయారు చేసిన జిల్లాలోని నియోజక వర్గాల ఓటరు జాబితాలను వివిధ పార్టీల నాయకులకు అందజేశారు. ఈ ముసాయిదా జాబితాను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25వ తేదీలోగా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని బూత్ లెవల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకొని ఆ రోజున కొత్త ఓటర్ల నమోదు లేదా మరణించిన వారు లేదా డబుల్ పేర్లు వచ్చిన వారి పేర్లు తొలగింపు వంటి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా లేదా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫారం -6 ద్వారా కొత్త ఓటర్ పేరు నమోదు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫారం-7 పేరు తొలగింపునకు ఫారం-8 పేర్లలో మార్పులు, చేర్పులకు వినియోగించుకోవాలన్నారు. ఈ దరఖాస్తులు అన్ని బూత్ సెంటర్లలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులకు ముసాయిదా ఓటర్ జాబితాను జేసీ, ఆర్‌డీవో రాము నాయక్‌తో కలిసి అందజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌లు రాజు, మంజుల, డీటీలు తదితరులు పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles