ఉత్సవాల పేరుతో ఇబ్బంది కల్గించొద్దు


Thu,September 13, 2018 01:04 AM

-ఎస్పీ కేపీ.లక్ష్మీనాయక్..
-అనుమతి లేకుండా విగ్రహాలు ప్రతిష్ఠించొద్దు
-ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దు
-డీజేలపై నిషేధం..
-నిబంధనలు విస్మరిస్తే కఠిన చర్యలు
గద్వాల క్రైం : వినాయక ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేపీ.లక్ష్మీనాయక్ హెచ్చ రించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వహకులకు ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించు కోవాలన్నారు. మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వహకులు తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో విగ్రహ ప్రతిష్ఠ చేయరాదన్నారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుల నుంచి బలవంతంగా వినాయక చందాలు వసూలు చేస్తే, కేసులు నమోదు చేస్తామన్నారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా మండపాలను ఏర్పాటు చేసుకొని, వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకునేలా నిర్వహకులు చూసుకో వాలన్నారు. మండపాలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, మహిళలు, యువతులు, విద్యార్థునులపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిసే,్త క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా, సౌండ్ పరికరాల ఏర్పాటు విషయంలో జాగ్రత్త పడాలన్నారు. శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజే పరికరంతో బీపీ, గుండె సంబంధిత వ్యాధులున్నవారు, వృద్ధులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో డీజేల వాడకం వినాయక ఉత్సావల్లో పూర్తిగా నిషేధమన్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా, శబ్దకాలుష్యాన్ని నివారించే పరికరాలను పోలీసుల అనుమతితో ఏర్పాటు చేసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, రాత్రి 10 గంటల తర్వాత మండపాల వద్ద సౌండ్ సిస్టంను నిలిపివేయాలన్నారు. ప్రతి మండపం వద్ద ఉదయం, రాత్రి తమ పోలీస్ సిబ్బంది తనిఖీకి వచ్చినపుడు నిర్వహకులు అందుబాటులో ఉండాలన్నారు. అపరిచితమైన వ్యక్తులు వచ్చి మండపాల్లో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తే వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ నిర్వహకులకు సూచించారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...