పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..

Thu,September 13, 2018 01:04 AM

-కుల వృత్తులకు చేయూత
-శాలివాహన కుమ్మరి వృత్తుల వారిచే మట్టి వినాయకుల తయారీ
-వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల విక్రయం
-తోడ్పాటునిచ్చిన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
గద్వాల, నమస్తే తెలంగాణ : పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందరూ మట్టి వినాకులు ప్రతిష్టించాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్య పర్చడంతో పాటు ఆదిశగా అడుగులు వేస్తుంది. వినాయక చవితి వచ్చిందంటే భక్తులు చాలా మంది వినాయకులను కొనుగోలు చేసి తమ ఇళ్లతో పాటు వివిధ ప్రాంతాలలో ప్రతిష్టిస్తారు. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాలలో పీవోపీతో వినాయకులను తయారు చేయడం వాటిని విక్రయించడం జరుగుతుంది. వాటి వల్ల పర్యావరణానికి ముప్పు వాటిళ్లడంతో పాటు నిమజ్జనం అనతంరం పీవోపీతో తయారు చేసిన విగ్రహాలు కరిగిపోక దానికి ఉయోగించిన రంగులు, రసాయనాల వల్ల నీరు కలుషితం కావడంతో పాటు చెరువులు, కాలువలు పూడిపోయే అవకాశం ఉంది. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లే వినాయకులకు స్వస్తిపలికి పర్యావరణానికి ముప్పులేకుండా ఉండేందుకు మట్టి వినాయకులను తయారు చేయడంతో పాటు కుల వృత్తులకు చేయూత నివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శాలివాహన కుమ్మరి వృత్తుల వారికి మట్టి వినాయకులు, మట్టి బొమ్మల తయారీపై జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చి వారి చేత వినాయక విగ్రహాలు తయారు చేయించి వారి చేతనే మార్కెట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంది. ఫలితంగా కుల వృత్తుల వారు మట్టి వినాయకులను తయారు చేసి విక్రయించారు.

జిల్లా నుంచి ఐదుగురిని శాలివాహన కుమ్మరి వృత్తి చేస్తున్న వారికి మట్టి వినాయకులు ,మట్టి బొమ్మల తయారి పై భూదాన్‌పోచంపల్లిలో రామానందతీర్థ ఇన్‌స్టూట్‌లో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన యువకులు జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహా ఆవరణలో 30 మంది శాలివాహన కుమ్మరి కుల వృత్తుల వారికి శిక్షణ ఇచ్చి వారితో మట్టి వినాయకులకు తయారు చేయిస్తున్నారు. శిక్షణపొందే వారికి జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల శాఖ ఆధ్వర్యంలో టీఏ, డీఏ ఇచ్చి శిక్షణ ఇస్తున్నారు. దీంతో జిల్లాలోని కుమ్మరి కుల వృత్తుల వారు వారే స్వయంగా మట్టి వినాయకులు తయారు చేసి మార్కెట్‌లో అమ్ము కోవడానికి వెనుకబడిన తరగతుల శాఖ ఏర్పాట్లు చేసింది. కుమ్మరి వృత్తి వారు తయారు చేసిన మట్టి వినాయకులను ఈ నెల 10వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అమ్మకాలు చేశారు.

111
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles